E-Paper
Advertisement

Venus Transit In Virgo 2024: ఈ రోజు నుంచి వీరికి మంచి రోజులు.. లక్ష్మీదేవి అనుగ్రహం

Venus Transit In Virgo 2024: ఈ రోజు నుంచి వీరికి మంచి రోజులు.. లక్ష్మీదేవి అనుగ్రహం
Advertisement

Venus Transit In Virgo 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమ, ఐశ్వర్యం, అందం, విలాసానికి కారకుడిగా చెబుతుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు శుభ స్థానంలో ఉన్న రాశులకు మంచి ఫలితాలు అందుతాయి. ఏ రాశిలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటాడో మారికి సమస్యలు ఎదురవుతాయి. శుక్రుడి శుభ స్థానం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.

ప్రస్తుతం సూర్యుడు రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆగస్టు 25 నుంచి శుక్రుడు బుధుడి రాశి అయిన కన్య రాశిలో సంచరించనున్నాడు. కన్య రాశిలో శుక్రుడు బలహీన రాశిగా చెబుతుంటారు. దీని వల్ల కొన్ని రాశుల వారు శుభ, అశుభ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు కన్య రాశిలో శుక్రుడు సంచరించనున్నాడు. శుక్రుడు ప్రవేశించిన వెంటనే కేతువు కలయిక జరగనుంది. శుక్రుడు కన్య రాశి సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సింహ రాశి:
కన్య రాశిలో శుక్రుడి సంచారం వల్ల సింహ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. శాంతి, సంతోషం పెరుగుతాయి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ఈ సమయంలో మీరు సంతోషంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా లాభాలు గడిస్తారు.

వృషభ రాశి:
కన్యరాశిలో శుక్రుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. పూజల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. మీ సామాజిక ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనుకూలమైంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

Advertisement

మకర రాశి:
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి. చిన్నచిన్న ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు యొక్క కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, ఆర్థికంగా వృద్ధి చెందుతారు. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కెరీర్ పరంగా ఇది మంచి సమయం. అంతే కాకుండా బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యలు నుంచి మద్దతు లభిస్తుంది.

Also Read: కన్యా రాశిలో రాజయోగం.. ఈ 3 రాశుల వారికి సెప్టెంబర్‌లో ఆదాయం పెరుగుతుంది

కన్య రాశి:
శుక్రుడ ఇదే రాశి సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు రెట్టింపు లాభాలు ఉంటాయి. శుక్రుడి ప్రభావంతో మీ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×