BigTV English

Vasant Panchami 2024: వసంత పంచమి రోజే సర్వార్థ సిద్ధి యోగం..ఈ రాశుల వారికి మంచి రోజులు షురు!

Vasant Panchami 2024: వసంత పంచమి రోజే సర్వార్థ సిద్ధి యోగం..ఈ రాశుల వారికి మంచి రోజులు షురు!
Astrology

Sarvartha Siddhi yoga on February 14th 2024 these Zodiac Signs get Benefits: రేపే వసంత పంచమి. అయితే.. ఈసారి ఈ పండుగ ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతోందని జ్యోతిషులు చెబుతున్నారు. వారి లెక్క ప్రకారం 32 ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ వసంత పంచమి రోజున.. సర్వార్థ సిద్ధి యోగంతో బాటు ఒకేరోజు రేవతి, అశ్విని నక్షత్రాలు ఉండబోతున్నాయి. ఈ అరుదైన యోగం కారణంగా ఈ కింది రాశుల వారికి పలు సానుకూల ఫలితాలూ సిద్ధించబోతున్నాయి.


మేష రాశి
చదువులో ఎదురవుతున్న సమస్యలు నేటి నుంచి తొలగిపోతాయి. చాలాకాలంగా వివాహం కాని మేషరాశి వారు చేసే వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. వ్యాపార రంగంలో ఇప్పటి వరకు ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితిని పొందుతారు. ఆదాయ మార్గాలు పెరిగి, ధనలాభమూ చేకూరుతుంది. మీరు పడే శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిపరంగా ప్రోత్సాహం, అభివృద్ధి సిద్ధిస్తాయి.

మిథున రాశి
వసంత పంచమి రోజున మిథున రాశి వారికి శుభ ఫలితాలు సిద్ధంచబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ వృత్తిలో రాణింపును పొందుతారు. పదోన్నతులు, వేతన పెంపు వంటి కీలక మార్పులు ఉంటాయి. వృత్తి పరంగా ఎదురయ్యే అనేక సమస్యలు తొలగిపోయి.. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు చేపట్టే ఈ కార్యమైనా ఫలిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.


వృశ్చికం
కార్యసిద్ధి ఉంది. నేటి శుభయోగం కారణంగా నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు, గుర్తింపు దక్కుతాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి.. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

మీన రాశి
నేటి నుంచి మీన రాశి వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఊహించని రీతిలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. మీ మనసు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీదికి మళ్లుతుంది. తీర్థయాత్రలు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటారు. ఎప్పటి నుంచో వసూలు కాని డబ్బు మీ చేతికి అందుతుంది. అనారోగ్యం తొలగిపోయి మనసు, శరీరం కుదుటపడతాయి.

ఈ రోజు చేయాల్సినవి
ఈ రోజు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, సరస్వతీ దేవిని ఆరాధించాలి. ముఖ్యంగా పసుపు పూలు, పసుపు వస్త్రాలు ధరించాలి. పసుపు ధాన్యాన్ని దానం చేయాలి. దీనివల్ల ఈ రాశుల వారికి బృహస్పతి(గురు గ్రహం) అనుకూలత చేకూరుతుంది.
జాతకంలో గురువు అనుగ్రహం ఉంటే.. తెలివితేటలు, మేధస్సు బాగుంటాయి. దీనివల్ల మంచి రాణింపు కలుగుతుంది. అద్భుతంగా ఉంటుంది. అన్నింటా మంచి ప్రావీణ్యం సంపాదించి చదువులో రాణిస్తాడు. ఒత్తిడి దూరమై పోయి మంచి ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×