BigTV English

Deputy Mayor of GHMC met CM Revanth: బీఆర్ఎస్‌కు షాక్.. సీఎంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ భేటీ..

Deputy Mayor of GHMC met CM Revanth: బీఆర్ఎస్‌కు షాక్.. సీఎంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ భేటీ..

GHMC Deputy Mayor met CM Revanth: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం అధిష్ఠించిన నాటి నుంచి అనేక మంది బీఆర్ఎస్‌ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. అదే తరుణంలో మరో బీఆర్ఎస్‌ నాయకురాలు కూడా అదే బాట పట్టారు. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌లు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న శ్రీలత.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునుంచి బరిలో నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.


అందులో భాగంగానే సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తున్నపట్టికి.. దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. భవిష్యత్తులో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌ తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటినుంచి ఆ పార్టీ నాయకుల్లో అనేక మంది కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆశక్తి చూపుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నలుగురు రేవంత్ రెడ్డిని కలవడంపై పెద చర్చే జరిగింది. అయితే, తమ నియోజకవర్గల్లో అభివృద్దిపై నిధులు మంజూరు చేయాలని కోరేందుకే సీఎంను కాలిశాము తప్ప పార్టీ మారే ఉద్దేశం లేదని వారు చెప్పుకోచ్చారు.

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఎంను కలిసి.. హైదరాబాద్‌లోని పలు ప్రాజెక్టుల గురించి ఆయనతో చర్చించినట్లు తెలిపారు. అంతే కాదు కేటీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరు మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్. ఆయన కూడా ముఖ్యమంత్రిని కలిసి.. మల్కాజ్‌గిరి లేద సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నట్లు రాజకీయ వార్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి.


రామ్మెహన్ కలిసిన వారం వ్యవధిలోనే ఇప్పుడు డిప్యూటీ మేయర్ దంపతులు ముఖ్యమంత్రిని కలవడంతో ఇంకెంతమంది పార్టీని వీడనున్నారు అనే సందేహాలు మొదలైయ్యాయి. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో తక్కువ సీట్లు సాధించిన హస్తం పార్టీ.. ఈ సారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే ఈ చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గల్లో చర్చలు సాగుతున్న.. వీటిపై మరి కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×