Big Stories

Akshardham Temple : అక్షరధామ్ టెంపుల్..గిన్నిస్ బుక్‌లో చోటు..

Akshardham Temple

Akshardham Temple : అక్షరధామ్.. అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం. ఇది భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. న్యూఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయం మతసామరస్యానికి అంకితం అయ్యింది. దీన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. ఈ ఆలయంలో భారతదేశపు పౌరాణిక నాగరికత అణువణువునా కనిపిస్తుంది. మరి అక్షరధామ్ ఆలయ విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

- Advertisement -

బంగారంతో స్వామివారి విగ్రహం..
వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్లు,పాలరాళ్లతో నిర్మించబడిన ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడలేదు. 141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షరధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయ గర్భగుడి భాగంలో పదకొండు అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, శిల్పకారులు, కవుల చిత్రాలు కట్టిపడేస్తాయి.

- Advertisement -

గిన్నిస్ బుక్‌లో చోటు..
ఎర్రటి ఇసుక రాళ్లతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల పరిక్రమ స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టి ఉంటుంది. దాని పొడవు దాదాపు 2 కి.మీ ఉంటుంది. 145 కిటికీలతో, 154 శిఖరాలతో కట్టిపేడేస్తుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News