Rashi Phalalu Nov 16: వేద జ్యోతిష్యశాస్త్రంలో 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశి ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు, నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు. నవంబర్ 16 శనివారం. శని ఆరాధనకు అంకితం చేసిన శనివారాన్ని, కర్మలను ఇచ్చేదిగా భావిస్తారు.
శని దేవుడిని ఆరాధించడం ద్వారా శని యొక్క సడేసతి , మహాదశతో సహా అన్ని అశుభ ఫలితాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. నవంబర్ 16 కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. మరికొందరికి ఇది సాధారణంగా ఉంటుంది. నవంబర్ 16, 2024న ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటు్ది. మీరు పూర్తిఆత్మవిశ్వాసంతో రోజును ప్రారంభిస్తారు. విద్యా, మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు.అంతే కాకుండా గౌరవం పొందుతారు.ఉద్యోగంలో అదనపు బాధ్యతను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. దాంపత్యంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. స్నేహితుడి సహాయంతో వ్యాపారం పెరుగుతుంది. లాభం కూడా ఉంటుంది.
మిథునరాశి: మిథున రాశి వారి మనస్సులో శాంతి, సంతోషం ఉంటుంది. పూర్తి విశ్వాసం కూడా ఉంటుంది. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యా, మేధోపరమైన పనిలో గౌరవం పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ తల్లిదండ్రుల సాంగత్యాన్ని పొందుతారు. సంతోషకరమైన ఫలితాలను అందుకుంటారు. మీ వాక్కు ప్రభావం పెరుగుతుంది.
సింహ రాశి: సింహ రాశి వారు పూర్తి విశ్వాసంతో ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది.అంతే కాకుండా ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కన్యా రాశి: కన్యా రాశి వారికి ఇబ్బంది కలగే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. మీరు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందుతారు.
తులారాశి: తులారాశివారి మనసులు కలత చెందుతాయి. కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి మనసులో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వ్యాపారం విషయంలో మీరు స్నేహితుడి నుండి మద్దతు పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి కూడా మద్దతు పొందుతారు. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనసు ఆనందంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ తండ్రి నుండి డబ్బు పొందవచ్చు. లాభం కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మకర రాశి: మకర రాశి ఉన్నవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఇంకా ఓపిక పట్టండి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది. లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వాహన సౌకర్యం తగ్గుతుంది.
Also Read: శని సంచారం..ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి
కుంభ రాశి: కుంభ రాశి వారికి వారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. కానీ మనసు కలవరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. పురోగతికి అవకాశాలు కూడా ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది.
మీన రాశి: మీన రాశి వారికి తమ పని పట్ల ఉత్సాహం ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఆస్తి వివాధాలు తొలగిపోతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి.