Kanguva Collections : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ మూవీ ‘ కంగువ ‘.. నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ చిత్రంగా ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండో రోజు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ట్రోల్స్ అందుకున్న ఈ మూవీ సరిగ్గా ఓపెనింగ్స్ ను అందుకోలేక పోయింది. కానీ రెండు రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. నెగిటివిటిని పక్కన పెట్టి సినిమాను థియేటర్లలో చూసేందుకు సూర్య ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మరి ఆలస్యం ఎందుకు రెండు రోజులకు కంగువ కలెక్షన్స్ ఎంత పెరిగాయో ఒకసారి చూసేద్దాం పదండీ..
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన కంగువ సినిమాను అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లు, ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్ తో సినిమాను రూపొందించారు. దాదాపు ఈ మూవీని రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేశారు. అయితే కథ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. మొదటి రోజు దారుణంగా పడిపోయిన కంగువ కలెక్షన్స్ రెండో రోజు కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూల్ చేసిందో ఒక్కసారి చూసేద్దాం..
కంగువకు దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్ ను పెట్టారు. కానీ కథ జనాలకు అర్థం కాకపోవడం తో సినిమాకు భారీ షాక్ తగిలింది. వరల్డ్ వైడ్ గా కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు వందల కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఫస్ట్ డే వసూళ్ల పరంగా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిన్న వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కంగువ రిలీజైంది.. మొదటి రోజు కాస్త డౌన్ అయ్యినా రెండో మాత్రం భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ.. 58.6 కోట్లు అందుకుందని తెలుస్తుంది. తాజాగా ఈ విషయాన్నీ కంగువ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక వీకెండ్ సినిమాలకు ప్లస్ అవుతుంది. మరి ఈ వీకెండ్ కంగువకు ఏ మాత్రం కలిసి వస్తుందేమో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీకి బాక్సాఫీస్ నిరాశ పరిచింది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లు మారింది. 400 కోట్ల భారీ వ్యయంతో ఈ మూవీకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం నిర్మాతలు టెన్షన్ లో ఉన్నారు. ఈ నెలలోపు పెట్టిన బడ్జెట్ అన్న రాబడుతుందేమో చూడాలి..