BigTV English

Horoscope 15 September 2024: ఈ రాశి వారికి లక్ష్మీకటాక్షం.. ఊహించని లాభాలు!

Horoscope 15 September 2024: ఈ రాశి వారికి లక్ష్మీకటాక్షం.. ఊహించని లాభాలు!

Astrology 15 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీకటాక్షం, విజయసిద్ధి ఉంటాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారంలో పురోగతి, ధన లాభం ఉంటుంది. పెండింగ్ సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో తోటివారి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృథా కాకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆదాయం వృద్ది చెందుతుంది.ఉద్యోగులకు ఊహించని ధనలాభాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు సామాన్యంగా ఉండవచ్చు. కుటుంబ సమస్యలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులు శుభవార్త వింటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధృడమైన మనస్సుతో ముందుకు సాగాలి. వృత్తి. వ్యాపార రంగాల వారికి ధనలాభం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. బంధు ప్రీతి ఉంది. మానసికంగా ధృడంగా ఉంటారు. కోపం, చిరాకు వంటి విషయాలకు దూరంగా ఉండాలి. నూతన వస్త్ర లాభం ఉంటుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

Also Read: శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని తినకూడదని తెలుసా? ఎందుకు తినకూడదో తెలుసుకోండి

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక పనుల్లో సవాళ్లు ఎదురైనా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారంతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో విజయం పొందుతారు. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. సంతానంపై ఆందోళన చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. శివారధన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు వారికి అనుకూలంగా లేదు.అన్ని రంగాల వారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో తోటి వారి సహాయం అందుతుంది. ఉద్యోగులకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఉద్యోగులు ఇతర సలహాలతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. విష్ణుసహస్రనామ పారాయణ శుభప్రదం.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. పెండింగ్ సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. లక్షీకటాక్షం ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఊహించని ధనప్రవాహం వరిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×