BigTV English

Ayodhya museum: 3డి, 7డి టెక్నాలజీలో హనుమాన్ గ్యాలరీ.. ఎక్కడో తెలుసా?

Ayodhya museum: 3డి, 7డి టెక్నాలజీలో హనుమాన్ గ్యాలరీ.. ఎక్కడో తెలుసా?

Hanuman gallery in Ayodhya museum with 20 minute short film: ఈ సంవత్సరం ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. దాదాపు 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. పూర్తిగా సంప్రదాయ ప్రాచీన రీతిలో నిర్మించిన ఈ ఆలయంతో బాలరాముడు కొలువై ఉన్నాడు. మొత్తం 2.77 ఎకరాల స్థలంలో ఈ అయోధ్య ఆలయం నిర్మాణం జరుపుకుంది. 392 పిల్లర్లు, ఐదు మండపాలు, నలభై నాలుగు తలుపులు ఉన్నాయి. దాదాపు 161 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు రూ.1500 కోట్లు ఖర్చయింది. వచ్చే ఏడాది చివరకల్లా అందుబాటులోకి వచ్చేలా అయోధ్య రామాలయంలో  రామ కథా మ్యూజియం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రామ మందిరం ట్రస్ట్ నిర్వాహకులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించారు.


ఏఐ టెక్నాలజీ

ఈ మ్యూజియం సరికొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ లను ఉపయోగించి సందర్శకులను వేరే లోకానికి తీసుకుపోయేలా..వారు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఈ మ్యూజియం తీర్చిదిద్దుతున్నారు. ఈ మ్యూజియం చూస్తుంటే ఒక పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ఖర్చుపెట్టిన రామాయణ సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ఎంతో కళాత్మకంగా దీనిని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో ఆంజనేయస్వామికి సంబంధించిన రామాయణ దృశ్యాల కోసం ప్రత్యేకంగా ఓ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇంక ఇరవై నిమిషాల నిడివి గల ఓ షార్ట్ ఫిలిం కూడా ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు సందర్శకుల కోసం. ఈ షార్ట్ ఫిలిం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.


పాన్ ఇండియా రేంజ్ లో షార్ట్ ఫిలిం

ఒకే సారి 25 మంది కూర్చుని ఈ షార్ట్ ఫిలిం చూసేలా రూపొందించారు. రోజు మొత్తం మీద 20 షోల దాకా ప్రదర్శన ఉండేలా చూసుకుంటున్నారు నిర్వాహకులు. ఇందులో హనుమంతుడి చరిత్ర మొత్తం క్లుప్తంగా రూపొందించారు. ఓ సినిమా రేంజ్ లో ఉంటుంది ఈ షార్ట్ ఫిలిం. 3డి, 7డి టెక్నాలజీని ఉపయోగించారు ఇందులో. 2025 సంవత్సరం చివరి నాటికి ఈ హనుమాన్ గ్యాలరీని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముడి దర్శనం అనంతరం తప్పక సందర్శించవలసిన ప్రదేశం రామ కథా మ్యూజియం.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×