BigTV English

Horoscope 2 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope 2 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Astrology 2 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులను పట్టువదలకుండా పూర్తి చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఇతరులను అతిగా నమ్మవద్దు. తోటివారి సహాయంతో ఆపదలు తొలగిపోతాయి. ఉద్యోగులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారుకుల ప్రయాణాలు కలిసివస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. బకాయిలు చేతికి అందుతాయి. తోటివారి సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని పనులు వాయిదా వేస్తే మంచిది. గణపతి ఆరాధన శుభప్రదం.

సింహం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో అదృష్టం వరిస్తుంది. ఆదాయం పదింతలు అవుతోంది. గొప్ప వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఊహించని లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. విష్ణు ఆరాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక విషయాల్లో పెద్దల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి, అలసటకు గురవకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

Also Read: బృహస్పతి ప్రభావంతో 3 నెలలు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !

తుల:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మబలంతో అద్భుతమైన విజయాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కలహాలకు తావివ్వరాదు. ప్రయాణాలు వాయిదా మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. మొహమాటం ఉండవద్దు. సామాజిక గుర్తింపు ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సలహాలు పాటించాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం, కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. చంద్రధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. లక్ష్యాలను చేరుకునేందుకు శ్రమించాలి. అన్ని రంగాల వారికి ఆటంకాలు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతోంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలాలు తొలగిపోతాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వరిస్తాయి. కొంతమంది వ్యతిరేకులుగా మారే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గిట్టని వారు దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. సహనం కోల్పోవద్దు. బంధువులతో జాగ్రత్తగా మెలగాలి. అష్టలక్ష్మీ స్తోత్రం చదవడం శ్రేయస్కరం.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అప్పగించిన పనులు సమర్ధవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య నమస్కారంతో మంచి జరుగుతుంది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని సంఘటనలతో మానసిక ఆనందాన్ని పొందుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంతో తీర్థయాత్రలు వెళ్తారు. శ్రీ మహాలక్ష్మీ దేవి ధ్యానం శుభకరం.

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×