BigTV English
Advertisement

Horoscope 20 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Horoscope 20 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది ? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక సమయాల్లో డబ్బు చేతికి అందుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను కుటుం సభ్యుల సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు ఆశించిన లాభాలు సమకూరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటాయి. ఊహించని ధనలాభం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యానికి గురి కావొచ్చు. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలులో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఊహించని హోదా పెరుగుతుంది. వ్యాపారులకు తగిన డబ్బు సమకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో చేపట్టి పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. విదేశీయానం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీ సందర్శన ఉత్తమం.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని సమక్షంలో మీ గౌరవం దెబ్బతింటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. నవగ్రహశ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మీ పనితీరుకు ప్రశంసలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత, చిత్తశుద్దితో సకాలంలో పూర్తిచేస్తి మంచి ఫలితాలను రాబట్టుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని పనుల్లో పెద్దల సహకారం అవసరం. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహాలతో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. పనిచేసే ప్రదేశాల్లో గొడవలకు దిగవద్దు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం:
మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఏ పని ప్రారంభించిన పూర్తయ్యే వరకు పట్టుదలతో పనిచేస్తారు. వృత్తి, వ్యాపారులకు ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇతరులను తొందరగా నమ్మకండి. ఉద్యోగులు క్లిష్టపరిస్థితుల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఈశ్వర సందర్శన మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడాలి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచిది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. చేసిన ప్రయత్నాలు గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×