BigTV English

Horoscope 21 August 2024: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం!

Horoscope 21 August 2024: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం!

Astrology 21 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తినిస్తుంది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాలు ఉంటాయి. సూర్యారాధన మేలుచేస్తుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగులు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గోవింద నామాలు పఠించాలి.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో సమయానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దల సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. దుర్గా శ్లోకం చదవాలి.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండనున్నాయి. ఉద్యోగాల్లో శారీరక శ్రమ, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో సహనం, ఓర్పు అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక వృద్ది సాధిస్తారు. వృథా ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆర్థికంగా బాగానే కలిసివస్తుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల సలహాలతో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు ఫలిస్తాయి. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు ధననష్టం కలగవచ్చు. బంధువుల ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర సందర్శన శుభప్రదం.

Also Read: ఈ 3 రాశుల వారు ఒక నెల వరకు ఆర్థిక నష్టం ఎదుర్కోక తప్పదు

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ఎదుర్కొంటారు. కుటుంబ కలహాలు కలుగవచ్చు. వ్యాపారాల్లో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గణపతి ప్రార్థన శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. చేపట్టిన పనులు తిరుగులేని విజయవంతమవుతాయి. లక్ష్మీకటాక్షం ఉంది. వ్యాపారులకు ధనం చేకూరుతుంది. కొత్త పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు సత్పలితాన్నిస్తాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×