Jiomart Offers: ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న పేరు జియోమార్ట్. రిలయన్స్ సంస్థ ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులకు విశ్వసనీయమైన సేవలను అందిస్తోంది. కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, బ్యూటీ ఉత్పత్తులు, కిచెన్ అవసరాలు, హోమ్ కేర్ వస్తువులు ఇలా రోజువారీ జీవితానికి కావలసిన ప్రతిదీ ఒకే చోట లభించడం దీని ప్రత్యేకత.
నగరాలు మాత్రమే కాకుండా పట్టణాలు, గ్రామాలకూ త్వరగా సరుకులు డెలివరీ చేసే సౌకర్యంతో జియోమార్ట్ చాలా తక్కువ సమయంలో ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మరింత బలపరచేలా జియోమార్ట్ ఈ నవంబర్లో వింటర్ సేవింగ్స్ కార్నివల్ పేరుతో అద్భుతమైన ఆఫర్లను ప్రారంభించింది. చలి కాలం ప్రారంభమవుతున్న వేళ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందిస్తోంది.
వింటర్ సేవింగ్స్ కార్నివల్ – 50శాతం వరకు తగ్గింపు
జియోమార్ట్‌లో ఈ నెల మొత్తం పాలు, టీ, హార్లిక్స్, రైస్, సర్ఫ్ ఎక్సెల్, వాసలిన్ వంటి ఉత్పత్తులపై 50శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. చలికాలంలో అవసరమైన ప్రతి వస్తువు హాట్ డ్రింక్స్ నుండి మాయిశ్చరైజర్ వరకు అన్నీ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి. ఇక ఫ్రెష్ జోన్ అనే విభాగంలో రోజువారీ పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటి తాజా వస్తువులు ఇంటికే డెలివరీ అవుతాయి. బయట మార్కెట్‌లో లభించే ధరల కంటే తక్కువగా ఇవి దొరుకుతాయి. 100శాతం నేచురల్ అని చెప్పబడిన పాలు, ఫ్రెష్ వెజిటబుల్స్ ఈ విభాగంలో ప్రధాన ఆకర్షణ.
బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు అన్నీ ఒకే చోట..
జియోమార్ట్‌లో ఫ్రెష్ మిల్క్ అండ్ బ్రెడ్ విభాగం కూడా ప్రత్యేకంగా ఉంది. అమూల్, హెరిటేజ్, మోడర్న్ వంటి ప్రముఖ బ్రాండ్ల పాలు, బ్రెడ్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ కోసం కెలాగ్స్ కార్న్ ఫ్లేక్స్, బ్రిటానియా హెల్తీ స్లైస్, హార్లిక్స్ వంటి ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
వంటగదికి కావాల్సివన్నీ సగం ధరకే..
ఇంటింటి స్త్రీలు ఎక్కువగా ఎదురుచూసే ఆఫర్ ఇదే. పిజియన్ ప్రెషర్ కుక్కర్లు, స్టీల్ ప్యాన్లు, కత్తులు, ప్లేట్లు, బౌల్స్, కంటైనర్లు అన్నీ సగం ధరకు దొరుకుతున్నాయి. ఆఫర్ వాలిడ్ టిల్ స్టాక్ లాస్ట్ అని జియోమార్ట్ ప్రకటించింది. అంటే స్టాక్ ఉన్నంతవరకే ఆఫర్.
బట్టలకు కూడా తగ్గింపులే!
అరియల్, సర్ఫ్ ఎక్సెల్, కమ్ఫర్ట్ వంటి డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ ఉత్పత్తులపై కూడా 50శాతం వరకు తగ్గింపులు ప్రకటించారు. చలికాలంలో బట్టలు ఎండకపోయినా, వాషింగ్ పౌడర్‌పై మాత్రం తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతున్నారు.
క్రీములు కూడా ఆఫర్
చలి కాలంలో చర్మం ఎండిపోకుండా ఉండటానికి క్రీములు కొత్త ఉత్పత్తి క్లౌడ్ సాఫ్ట్‌ను తీసుకువచ్చింది. ఈ మాయిశ్చరైజర్ చర్మానికి పది రెట్లు ఎక్కువ తేమ అందిస్తుందని సంస్థ చెబుతోంది. వాసలిన్ ఉత్పత్తులపై కూడా 50శాతం తగ్గింపు కొనసాగుతోంది.
క్రేజీ డీల్స్!
రోజూ మారే ఈ ఆఫర్‌లో అగర్బత్తీలు, చోకో ఫిల్స్ కుకీస్, బిస్కెట్లు, చాక్లెట్లు తక్కువ ధరకే లభిస్తాయి. రూ.125 విలువైన అగర్బత్తీలు కేవలం రూ.89కి, రూ.170 విలువైన డార్క్ ఫ్యాంటసీ చోకో ఫిల్స్ కేవలం రూ.99కి!
ప్రతి ఇంటికీ అవసరమైనవి
గోధుమ, మైదా, రాగి, సజ్జల పిండి వంటి వస్తువులపై 30శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. రోజువారీ వంటకు ఇవి తప్పనిసరి కాబట్టి ఈ ఆఫర్ ప్రతి కుటుంబానికి లాభం అనే చెప్పాలి. కాబట్టి జియోమార్ట్ ఈ నవంబర్‌లో వినియోగదారులకు నిజమైన సేవింగ్స్ సీజన్ తెచ్చింది. చలికాలం ప్రారంభం అవుతుండగా, ధరలు మాత్రం తగ్గుతున్నాయి. కావాలంటే మీరు కూడా ఇప్పుడే జియోమార్ట్ యాప్ ఓపెన్ చేసి ఈ వింటర్ ఆఫర్లను మిస్ కాకుండా ఆర్డర్ పెట్టేయండి.
ఆఫర్లు ఎప్పటి వరకు?
నవంబర్ 1 నుండి 7 వరకు ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. రన్వీర్ సింగ్, దీపికా పాదుకొనే ప్రమోట్ చేస్తున్న ఈ క్యాంపెయిన్ ద్వారా “ఫాస్ట్ డెలివరీ” మరియు లో ప్రైస్ గ్యారంటీని జియోమార్ట్ హామీ ఇస్తోంది. ఉచిత హోమ్ డెలివరీ, ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా అందించే సౌకర్యం వినియోగదారులకు మరింత నమ్మకాన్ని ఇస్తోంది.