BigTV English

NBK109 Sankranti Release: సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా.. మరోసారి చిరుతో పోటీ!

NBK109 Sankranti Release: సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా.. మరోసారి చిరుతో పోటీ!

NBK 109 movie release update(Today tollywood news): సినిమాలకు సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేక సీజన్. ఈ సీజన్ లో యావరేజ్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. అందుకనే ప్రముఖ హీరోలందరూ సంక్రాంతి పండుగ సమయంలో తమ సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో 2025 సంక్రాంతి సినిమాల పోటీలు కూడా రసవత్తరంగా మారాయి. దీనికి ప్రధాన కారణం ఈ పోటీలో హాట్ ఫేవరేట్ హీరో బాలయ్య ఎంట్రీ ఇవ్వడం.


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లీ దర్శకత్వంలో రపొందుతున్న చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా.. అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తిచేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ ఈ సినిమా ముందుగా డిసెంబర్ లో విడుదలకు ప్లానింగ్ జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయించినట్లు సమాచారం. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి, శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బాలకృష్ణ నటించిన వీరా సింహా రెడ్డి చిత్రంలో జై బాలయ్య పాటతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి కూడా క్రేజీ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రాజస్థాన్ లో ఓ భారీ యక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.


అయితే సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల జాబితాలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఉంది. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకుడు. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి సీజన్ టార్గెట్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య చిత్రాలు ఢీ అంటే ఢీ అని పోటీ పడిన చాలా సందర్భాలున్నాయి. అయితే బాలయ్య సినిమాలు ఎక్కువ సార్లు పైచేయి సాధించగా.. వీరిద్దరూ చివరగా పోటీపడిన రెండు సార్లు మెగాస్టార్ సినిమాలు ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. 2017లో బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’తో చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం.150’ పోటీ పడింది. అలాగే 2023లో బాల‌య్య నటించిన ‘వీర సింహారెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీర‌య్య‌’ చిత్రాలు సంక్రాంతి సీజన్ ని భారీ కలెక్షన్లతో ఊపేశాయి. అయితే ఈసారి వెంకటేష్ కూడా బరిలో ఉండడంతో త్రికోణపు పోటీ నెలకొంది.

Also Read: విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరో ఎవరంటే.. ?

బాలయ్య అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. బాలకృష్ణ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించబోతున్నారు. మరోవైపు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ హీరోగా సినిమా షూటింగ్ సెప్టంబర్ లో ప్రారంభంకాబోతోంది. మోక్షజ్ఞ తొలిసినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కావడం విశేషం.

Also Read: సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు.. ‘కొత్త చట్టం తీసుకురావాలి’

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×