BigTV English

Horoscope 28 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Horoscope 28 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

Astrology 28 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమంతుడిని ఆరాధించాలి.

వృషభం:
ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో బుద్ధిబలంతో వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక వృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలకు హోదా పెరుగుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపం, ఆందోళన, ఒత్తిడిలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యఆరాధన మంచిది.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. శ్రీఆంజనేయుడిని ఆరాధిస్తే శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్దితో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి పని భారం, ఒత్తిడి పెరుగుతుంది. సమయాన్ని వృథా చేసుకోకూడదు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.

సింహం:
సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. కీలక పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. తోటివారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణ మంచిది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల సలహాలతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. విహారయాత్రలు వెళ్తారు. కోపం, చిరాకు అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

Also Read: రాశి మారనున్న శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి ఊహించని లాభాలు

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రణాళికతో కీలక పనులు పూర్తిచేస్తారు. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటాయి. రచయితలకు, కళాకారులకు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీగణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సలహాలు అవసరం. ఆర్థికలావాదేవీలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం అవసరం. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు అందరి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. శ్రీరామనామానని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శుభవార్త వింటారు. కీలక రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు సవాళ్లు ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వృథా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా లేదు. కీలక పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్ని రంగాల వారికి ఆటంకాలు, సవాళ్లు ఎదురుకావొచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులు, భూముల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అనుకున్న పనులు మనోబలంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సవాళ్లను ఎదుర్కొంటారు. మాటలను అదుపులో పెట్టుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండవచ్చు. శ్రీదుర్గాదేవి ధ్యానంతో అనుకూల ఫలితాలు ఉంటాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×