BigTV English
Advertisement

KCR Call to kavitha: కేసీఆర్ ఫోన్.. కవితతో కాసేపు.. రెండే రెండు మాటలు

KCR Call to kavitha: కేసీఆర్ ఫోన్.. కవితతో కాసేపు.. రెండే రెండు మాటలు

KCR Call to kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపో మాపో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చే అవకాశమున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కవిత బెయిల్ పిటిషన్ సమయంలో న్యాయస్థానంలో జరిగిన వాదోప వాదనలు గమించిన ఆప్ నేతలు, కేజ్రీవాల్‌కు బెయిల్ కచ్చితంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు.


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులుగా భావిస్తున్న వారంతా ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో తొలుత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాగా, ఇప్పుడు కవిత వంతైంది. వచ్చే నెల చివరినాటికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడం ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల అయ్యారు. అక్కడి నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్లారు.

తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కారు ఎక్కి కూర్చున్నారు. అంతలో తండ్రి కేసీఆర్ ఫోన్ చేసినట్టు కూతురుతో మాట్లాడినట్టు తెలిసింది. బిడ్డా ఎలా వున్నావు.. ఆరోగ్యం మంచిగా ఉందా? అనేసరికి కవిత ఒక్కసారిగా కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కవితను ఓదార్చినట్లు సమాచారం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.. బాధపడకు అంటూ జాగ్రత్తలు చెప్పినట్టు సమాచారం. కవిత కూడా రియాక్ట్ అయ్యారు. నాన్న.. బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగినట్టు తెలిసింది. ఈ సమయంలో కవితకు కాసింత దైర్యం చెప్పారట కేసీఆర్.


ALSO READ: లొకేషన్స్ నచ్చినట్టు మార్చారు.. ఘోష్ కమిషన్ ఫైర్

తీహార్ జైలు నుంచి నేరుగా అక్కడి పార్టీ ఆఫీసుకు వెళ్లారు కవిత. ఆమెతోపాటు భర్త అనిత్, సోదరుడు కేటీఆర్, హరీష్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఆఫీసులో సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత రానున్నారు. హైదరాబాద్‌కు చేరుకోగానే ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఎర్రవల్లిలో ఉన్న తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకోనున్నారు.

జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కుట్ర పూరితంగా తనను జైలుకు పంపినవారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని వివరించారు. అందరిని వదిలి ఐదునెలలు దూరంగా ఉన్నానని, ఆ సమయంలో తాను చాలా ఇబ్బందిపడ్డానంటూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున నిలబడి పోరాడుతానని, కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన వారికి పాదాభివందనాలు తెలిపారామె.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా మద్యం కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. దీంతో సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదేనెల 22న ఈసీ కూడా కేసు నమోదు చేసింది. అదే ఏడాది నవంబర్ 25న తొలి ఛార్జిషీటు దాఖలైంది. అందులో హైదరాబాద్ సౌత్ గ్రూప్‌తోపాటు కీలక విషయాలు ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. గతేడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘువరెడ్డి, దినేశ్ అరోరా అరెస్టు చేయడం, ఆ తర్వాత వాళ్లు అప్రూవర్లగా మారడం జరిగిపోయింది. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ లో కవితను ఈడీ చేసిన విషయం తెల్సిందే.

Related News

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Big Stories

×