Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలకు అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.
వృషభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మిథునం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం: చేపట్టినపనులలో అప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఇంట్లో ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి.
సింహం: చాలకాలంగా బాదిస్తున్న సమస్యలు క్రమం క్రమక్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో ఇంట్లో సరదాగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో కానీ ఫలితం కనిపించదు.
కన్య: దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను పెంచుకుంటారు. స్థిరాస్తి లాభాలు పొందుతారు విద్యార్థుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సహచరులతో మాట పట్టింపులు తొలగుతాయి.
తుల: చేపట్టిన పనులలో విజయం సాదిస్తారు. సంతానం విద్యా విషయాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.
వృశ్చికం: చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ధనస్సు: నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటికి బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు వెళ్లడం మంచిది.
మకరం: శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ఆత్మీయులతో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అవసరానికి చేతికందుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నం సక్సెస్ అవుతుంది.
కుంభం: చేపట్టిన పనులువాయిదా పడతాయి. కుటుంబ ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.
మీనం: చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?