BigTV English
Advertisement

Allu Arjun : మరో వివాదంలో అల్లు అర్జున్.. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్..

Allu Arjun : మరో వివాదంలో అల్లు అర్జున్.. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్..

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ ను అందుకుంది. దాంతో ఈ మూవీ రిలీజ్ అయ్యిన కొద్ది రోజుల్లోనే 1800 కోట్లు వసూల్ చేసింది. అటు బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ అందుకొని రికార్డులను ఈ మూవీతో అందుకోవడం విశేషం. పుష్ప 2 మూవీతో రికార్డుల మోత మోగిపోవడమే కాదు.. వివాదాలు కూడా కొని తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే.. ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నాడు. తాజాగా ఈ మూవీ థాంక్స్-యూ మీట్‌ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బన్నీ నోరు జారి మరో వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


పుష్ప 2 థ్యాంక్యూ మీట్..

అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ని అందించారు. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన రోజు చోటుచేసుకున్న పరిణామాల రీత్యా చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్‌ మీట్‌ ను నిన్న గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 బెనిఫిట్‌ షో సమయంలో థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో రేవతి, ఆమె తనయుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు.. ఆ కారణంతోనే ఎటువంటి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చెయ్యలేదు. అన్నీ గొడవలు కాస్త సర్దు మణిగిన తర్వాత నిన్న పుష్ప 2 మేకర్స్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ గా మారింది..


మరో వివాదంలో అల్లు అర్జున్..

పుష్ప 2 రిలీజ్ టైం లో సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టూముట్టాయి. దాంతో ఆయన ఎటువంటి ప్రత్యేక ఈవెంట్స్ కు హాజరు కాలేక పోయాడు. మొన్న జరిగిన తండేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. ఇదే మొదటి ఈవెంట్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో వివాదంలో చిక్కుకున్నాడు.. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు బాలీవుడ్ అనే పదం అస్సలు నచ్చదు. హిందీ మూవీ అని పిలవడమే ఇష్టమని అన్నారు. ఆ మాటలకు అలెర్ట్ అయిన నిర్మాత బాలీవుడ్ పదానికి క్లారిటీ ఇవ్వాలని కోరాడు. దాంతో నాకు బాలీవుడ్ అనే పదమే నచ్చదు హిందీ సినిమానే నాకు ఇష్టం అని బన్నీ క్లారిటీ ఇచ్చాడు. సినిమా కోసం హిందీలో ఓ స్టార్ హీరో సినిమాని పోస్ట్ పోన్ చేశారు అందుకు నేను వాళ్లకి ఫోన్ చేసి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పానని బన్నీ అన్నారు. అలాగే ఆర్మీ అనే పేరు కూడా మరోసారి బన్నీ నోట వినిపించడం గమనార్హం.. మొత్తానికి ఇది చూస్తుంటే మరో వివాదానికి తెర లేపినట్టు కనిపిస్తుంది ఇక ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×