BigTV English

Horoscope Today May 4th : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభాలు – ఉద్యోగస్తులకు శుభవార్తలు

Horoscope Today May 4th : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభాలు – ఉద్యోగస్తులకు శుభవార్తలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 4న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


 మేషం: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే
ఉంటుంది.

వృషభం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగంలో వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.


మిధునం: ఇంట్లో వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

కన్య: సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

 తుల: వాహన ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ధనస్సు: దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం: బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

 

ALSO READ: జన్మజన్మల్లోవెంటాడేకర్మలుఅవేనట – మీరు ఏ కర్మలుచేశారోతెలుసా..?

 

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×