Tollywood Hero: టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 మూవీలో నటించారు. ఆ మూవీ మే డే సందర్భంగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.. ఈ వీకెండ్ లో 100 కోట్లకు క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉందని నాని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది అటు ఉంచితే నాని ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కన్నడ స్టార్ హీరో సుదీప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాని పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని..
టాలీవుడ్ స్టార్ హీరో నాని పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల ఓ కన్నడ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సుదీప్ పై కామెంట్స్ చేశాడు.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నాని మాట్లాడుతూ మధ్యలో సుదీప్ గురించి ప్రస్తావన వచ్చింది. వీరిద్దరూ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా లో నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ సుదీప్ – నానిల మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. నాని బెంగుళూరు వెళ్తే సుదీప్ ని కలుస్తాడు.. సుదీప్ హైదరాబాద్ లో ఉంటే నానిని మీట్ అవుతాడు.. అదే విధంగా హిట్ 3 ప్రమోషన్ లో భాగంగా నాని బెంగళూరు కు వెళ్లాడు. అక్కడ ప్రెస్ మీట్ లో సుదీప్ గురించి మాట్లాడారు..
Also Read :ఆ హీరో మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్.. మరో కిస్సిక్ అవుతుందా..?
మా మధ్య సీక్రెట్ ఎఫైర్ నిజమే..
నాని మీడియా తో మాట్లాడుతూ సుదీప్ తో ఉన్న రిలేషన్షిప్ ని బయట పెట్టాడు. సుదీప్, నాని మధ్య సీక్రెట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ఉందనే ఓ రూమర్ ఉంది. దీనిపై ఏమంటారు? అని యాంకర్ ప్రశ్నించాడు. దానికి నాని మాట్లాడుతూ అవును నిజమే. ఆ విషయం సుదీప్ వాళ్ళ వైఫ్ కూడా తెలుసు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూ లో సుదీప్ కు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అతన్ని కలుస్తాను. అతను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలుస్తాడు అని సుదీప్ సమాధానమిచ్చారు.. మొత్తానికి వీరిద్దరి మధ్య మంచి బంధం ఉందని అర్థం అయింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి తప్పు సమాధానం చెప్పాలి కాబట్టి అలా చెప్పాడు నిజానికి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఈ విషయం అందరికీ తెలుసు. ఇక నాని సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో పారడైజ్ సినిమా చేస్తున్నాడు..