BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి సమస్యలు ఎదురవుతున్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన చేస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కీలక నిర్ణయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభకరం.


మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో పూర్తిచేస్తారు. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శని, గురు శ్లోకాలు పఠిస్తే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు అనుకూలించవు. హనుమాన్ చాలీసా చదవడంతో మంచి ఫలితాలు పొందుతారు.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను చిత్తశుద్ధితో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఉండాలి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనవసర ఖర్చులను అదుపులో చేసుకోవాలి. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ప్రయాణాలు ఉంటాయి. మాటలను అదుపులో పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. పెద్దల సలహాలు పనిచేస్తాయి. గణపతి ప్రార్థన శుభకరం.

తుల:
ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాతో పూర్తి చేస్తారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి పనులు మొదలు పెట్టాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. పెండింగ్ బకాయిలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనారోగ్యంపై అధిక ఖర్చు చేస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. శ్రీలక్ష్మి దేవి సందర్శనం శుభకరం.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. కొన్ని సంఘటనలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వరిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో అసాధరణమైన విజయాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు అనుకూలించవు. హనుమాన్ చాలీసా చదవాలి.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×