BigTV English
Advertisement

India vs Sri Lanka: రెండో టీ20లోనూ భారత్ విజయం..సిరీస్ కైవసం

India vs Sri Lanka: రెండో టీ20లోనూ భారత్ విజయం..సిరీస్ కైవసం

India vs Sri Lanka T20 Series: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(53) రాణించగా.. పాతుమ్ నిస్సంక 32 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో రవి బిస్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా..అర్షదీప్ సింగ్ రెండు, అక్షర్ పటేల్ రెండు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.

శ్రీలంక విధించిన 162 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత్ కు వరుణుడు అడ్డుకున్నాడు. మొదటి మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయగా..వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు పిచ్ ను పరిశీలించి 8 ఓవర్లకు కుదించారు. దీంతో భారత్ టార్గెట్ 78 పరుగులుగా నిర్ణయించారు.


Also Read: తొలి పతకం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఓపెనర్ యశస్వి జైస్వాల్(30), సూర్యకుమార్ యాదవ్(26) రాణించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య(22)చెలరేగడంతో భారత్..కేవలం 6.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే గిల్ స్థానంలో ఈ మ్యాచ్‌కు అవకాశం దక్కించుకున్న సంజు డకౌట్ గా విఫలమయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, వానిందు హసరంగా, పతీరణ తలో వికెట్ తీశారు.

Related News

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Ind vs Sa: కాపు – చౌదరి మధ్య చిచ్చు పెట్టిన దక్షిణాఫ్రికా లేడీ బౌలర్!

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Big Stories

×