BigTV English
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..12 రాశుల్లో ఏ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. ఏ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అనే వివరాలను జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులు కొత్త మైలురాయి సృష్టించుకుంటారు.ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు పాటించాలి. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన మంచిది.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, ఉద్యోగ రంగాల వారు ప్రమోషన్స్ పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా బుద్దిబలంతో అధిగమిస్తారు. మంచి శుభవార్త వింటారు. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఇష్టదైవారాధన తప్పనిసరి.

కర్కాటకం:
కర్కాటకరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగలు కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిరాశకు గురవుతారు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల నుంచి ప్రమాదం ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ఎదుర్కొంటారు. శివారాధన మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధువుల నుంచి లబ్ధి పొందుతారు. అనారోగ్య సమస్యలపై జాగ్రత్తలు అవసరం. అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ సందర్శనతో శుభ ఫలితాలు వస్తాయి.

తుల:
తులరాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమువుతాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కీలక పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఆర్థకంగా వృద్ధి చెందుతారు. సమాజంలో కీర్తి లభిస్తుంది. శివారాధన చేస్తే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో బుద్ధి బలంతో అధిగమిస్తారు. ప్రయాణాలు ఉంటాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. గురు శ్లోకాలు పఠిస్తే మంచిది.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. పనులపై ఏకాగ్రత, పట్టుదల చాలా అవసరం. నైపుణ్యాలు పెంచుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. పెద్దల సలహాలు పనిచేస్తాయి. అనవసర ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈశ్వర ఆరాధన మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి పొందుతారు. ప్రారంభించిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి సామన్యంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడి పెరగడంతో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Big Stories

×