BigTV English
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్రప్రకారం.. మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది? అనే విషయాలను జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. ఆశించిన రాబడి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషదాయకంగా గడుస్తుంది. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుస్తుంది. గణేశాష్టకం పఠించండి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆర్థికంగా మరింత బలపడతారు. రుణగ్రస్తుల బాధలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. చిరకాల శత్రువులు కూడా మిత్రులుగా అనుకూలంగా మారతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. శివాష్టకం పఠించండి.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. పనులలో ప్రతిబంధకాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా సాగవు. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దుర్గాదేవిని స్మరించండి.

కన్య:
ఈ రాశి వారికి మంగళకరమైన రోజు. ఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి. నృసింహ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి లాభదాయకమైన రోజు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దేవీ స్తోత్రాలు పఠించండి.

మకరం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం:
ఈ రాశి వారికి శుభకరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి సమస్యలను అధిగమిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలం. సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో మరింత దూసుకువెళతారు. ఉద్యోగులకు కీలక సందేశం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×