BigTV English

Pandari Puram : పండరీ పురానికి ఆపేరు ఎలా వచ్చింది.

Pandari Puram : పండరీ పురానికి ఆపేరు ఎలా వచ్చింది.
Pandari Puram


Pandari Puram : మహారాష్ట్రలోని పండరీపూరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేవుడి పేరు ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాదు. భక్తుడి పేరుతో ప్రాచుర్యం చెందిన ప్రాంతం. దేవీ దేవతల పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకి భిన్నమైన
ఊరు పండరీపుర క్షేత్రం. భక్తుడి కోరిక మేరకు మండు టెండలో సుదీర్ఘ కాలం నిలబడి తాను భక్తికి కట్టుబడి ఉన్నానని ఆ దేవుడే నిరూపించిన ప్రాంతం కూడా ఇదే. శ్రీకృష్ణుడి మీద అలిగి వచ్చి రుక్మిణిదేవి తప్పస్సు ప్రాంతంగా కూడా పండరీపురమే. శ్రీకృష్ణ భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాల్లో ఒకటి. శివుడు, కేశవుడు ఇద్దరూ ఒక్కటే నిరూపించిన ప్రాంతాల్లో పండరీపురం నిలుస్తుంది. పండపూరీ పురం ఆధ్యాత్మికంగానే పర్యాటకంగాను యాత్రికులని ఆకర్షించే ప్రాంతం ఇది.

ఆదిశంకరాచార్యుల వారు పాండురంగ అష్టకాన్ని ఇక్కడే రచించారు.అభిషేకం చేసే సమయంలో పాండరంగడ్ని దర్శించుకుంటే కొన్ని విషయాలు గుర్తించవచ్చు. పాండరంగడి తల లింగాకారంలో కనిపిస్తుంది. మహారాష్ట్రలో పాండురంగడుని ఎక్కువ ఆరాధిస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లో పండరీపురం కూడా ఒకటి. పూర్వం ఈ ప్రాంతంలో విష్ణుభక్తులైన ఇద్దరు దంపతులు ఉండే వారు. వారి కుమారుడే పుండరీకుడు. చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసై బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండే వాడు. తల్లిదండ్రుల్ని , భార్యని కూడా ఇబ్బంది పెట్టేవాడు. తమ కుమారుడి జీవితం నాశనం అవడాన్ని చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు ఆ దేవుడ్ని వేడుకున్నారు.


తర్వాత పుండరీకుడికి ఎదురైన కొన్ని చేదు అనుభవాలు జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. భక్తిమార్గాన్ని చూపిస్తాయి. కుక్కుటముడు అనే ముని గొప్పతనాన్ని తెలుసుకుని తర్వాత శ్రీవిష్ణు ఆరాధన మొదలుపెడతాడు. తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో తల్లిదండ్రులకి సేవ చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో పుండరీకుడ్ని పరీక్షేందుకు స్వామి బాలుడి రూపంలో వచ్చి బయటకి పిలుస్తాడు. తల్లిదండ్రులకి సేవ చేస్తున్నానని కాసేపు ఆగమంటాడు పుండరీకుడు. అలా సేవ చేస్తూ ఉండపోవడంతో బయట ఎండలోనే బాలుని రూపంలో ఉన్న స్వామి నిలబడి ఉంటారు.కాసేపటికి పుండీరుకుడి ఒక ఇటుకని బయటికి విసిరి దానిపై నిలబడిమని చెబుతాడు. తన భక్తుడు బయటకి వచ్చే వరకు ఎండలో నడుంపై చేతులు వేసుకుని నిలబడి చిద్విలాసంతో ఉంటాడు పాండురంగడు. బయట స్వామి చేసిన విన్యాసాలను చూసి తన తప్పు తెలుసుంటాడు పుండరీకుడు. తల్లిదండ్రులపై అతడి ప్రేమను స్వామి మెచ్చుకుని ఏ వరం కావాలో అడుగమని అదేశిస్తాడు. తనకి దర్శనమిచ్చినట్టుగానే నడుముపైన చేతులతో నిలబడి భక్తుల్ని దర్శనమివ్వమని స్వామి ప్రార్ధిస్తాడట. భక్తుడి కోరిక మన్నించి విష్ణుమూర్తి పాండురంగడు అవతారంలో ఆ క్షేత్రంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×