E-Paper
Advertisement

Shanishinganapur: శనిశింగణాపూర్ వెళ్తున్నారా వెనక్కి తిరిగి చూడద్దు…

Shanishinganapur: శనిశింగణాపూర్ వెళ్తున్నారా వెనక్కి తిరిగి చూడద్దు…
Advertisement

Shanishinganapur:ప్రసిద్ధ దేవాలయాలలో శని శింగణాపూర్ ఒకటి. ఈ ఆలయం షిర్డీకి సుమారు 90 కిమీ దూరం లో ఉంది. ఈ ఆలయం లో పూజలు ఆడవాళ్లు చేయకూడదు అని చెబుతుంటారు. శనీశ్వరునకు ప్రత్యేకంగా ఆలయం అంటూ ఏమి లేదు. ఇక్కడ స్వామి వారు స్వయంభు అని చెబుతారు . ఒక నల్లటి పొడవైన రాయి మాత్రమే ఉంటుంది. పూర్వం మేకలను మేపుకునే వారు శనీశ్వరుని రాయి అనుకుని పదునైన చువ్వతో రాయిని తాకగా ఆ రాయిలోంచి రక్తం రావడం చూసి వారు భయపడిపోయారు. ఈ అద్భుతాన్ని చూడ్డానికి చుట్టుప్రక్కల వారందరు వచ్చారు. ఆ రోజు రాత్రి మేకల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి నేను శనీశ్వరుడును అని చెప్పుకుంటూ అద్వితీయంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తనరూపమేనని చెప్పారట.ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను.

శనీశ్వరుని దర్శనం అయినా తరువాత తిరిగి వెనక్కి చూడకూడదు . శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ నమ్మకం. ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×