Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢీ 10 విజేతగా రాజు(Raju) హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజు తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో వర్ష రాజు ప్రేమ గురించి ప్రశ్నించడంతో ఈయన ఏకంగా తన బ్రేకప్ లవ్ (Break Up)స్టోరీని బయటపెట్టారు.
రాజు జీవితంలోకి రాణి ఎప్పుడు రాబోతోంది అంటూ వర్ష ప్రశ్నించడంతో రాజు జీవితంలో రాణి లేదని, ఇకపై రాదని ఈయన సమాధానం ఇవ్వడంతో ఒకసారిగా అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈయన గత మూడు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారని, ఆ అమ్మాయి తన సొంతమని భావించాను కానీ తనని దూరం చేసి వెళ్లిపోయిందంటూ తన బ్రేకప్ స్టోరీ బయటపెట్టారు. నిజానికి మా ఇద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి కారణం ఇద్దరికీ మెచ్యూరిటీ లేకపోవడమేనని తెలిపారు.
ఆ అమ్మాయిని తాను చాలా ప్రేమించాను ఎంత ప్రేమించాను అంటే తను లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేనంతగా తనని ఇష్టపడ్డానని, కానీ ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ తన బ్రేకప్ స్టోరీ గురించి తెలిపారు .అయితే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలు వెల్లడించలేదు. ఈ విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇటీవల కాలంలో అబ్బాయి తాగుతున్నారు అంటే కచ్చితంగా బ్రేకప్ స్టోరీ ఉంటుందని ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని తాగుతున్నారు, తననే తలుచుకొని ఏడుస్తున్నారని అర్థం అంటూ రాజు తెలిపారు. అందరికీ ఒకటే చెబుతున్నా డార్లింగ్స్.. మనకెందుకు లవ్వు.. కెరియర్ పై ఫోకస్ పెట్టాలి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అంటూ రాజు కామెంట్స్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఢీ 20 గురించి మాట్లాడారు. అదేవిధంగా తన ఫ్యామిలీ గురించి, తన కెరియర్ గురించి తెలిపారు. ఇక తన కెరియర్ కోసం రాజు పడిన ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారని ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఇక రాజు డాన్స్ పై ఎంతో మక్కువతో ఢీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇలా ఢీ 10 విజేతగా నిలిచి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది తమలో ఉన్న ప్రతిభను బయట పెడుతూ వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తూ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ కొరియోగ్రాఫర్లు సైతం ఢీ వేదికపై సక్సెస్ అందుకున్న వారే అని చెప్పాలి.
Also Read: Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!