UP Train Accident: యూపీ మీర్జాపూర్‌లోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలోని పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఓ ఆరుగురు చోపాన్ ప్రాంతం నుండి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో అటుగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టి.. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతులను పోస్టుమార్టంకు తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను హాస్పిటల్ కి తరలించగా మార్గమద్యంలో మరణించినట్టు సమాచారం.