Anantapur Crime: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి పట్టణంలో యూనియన్ బ్యాంకు మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత సంవత్సరం నుంచి తాడిపత్రి పట్టణంలోని యూనియన్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న గోగర్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం 11 గంటలు దాటినా మేనేజర్ ఆఫీస్‌కు రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి ఉద్యోగులు ఆయన ఉంటున్న గదికి వెళ్లి చూడగా ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తోటి ఉద్యోగులు వివరాల ప్రకారం.. మేనేజర్ జస్టిస్ గోగర్ ఉదయం 11 గంటల సమయానికి కూడా విధులకు హాజరు కాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన రూంకి వెళ్లి తలుపు తట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో, కిటికీ ద్వారా లోపలికి చూశారు. గదిలో మేనేజర్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే వారు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు జస్టిస్ గోగర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తోటి ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బ్యాంకు మేనేజర్ జస్టిస్ గోగర్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల తోటి ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి’ అని వారు పేర్కొన్నారు. జస్టిస్ గోగర్ గత సంవత్సరం నుంచి తాడిపత్రి బ్రాంచ్‌లో మేనేజర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన.. ఏమైనా ఒత్తిడులు ఉన్నాయా లేదా వ్యక్తిగత సమస్యలు కారణమా అనే విషయం తమకు తెలియదని వారు చెప్పారు.
యూనియన్ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లా..? వ్యక్తిగత సమస్యలా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు