BigTV English
Advertisement

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Jatadhara trailer : ఈరోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా ప్రేక్షకుడిని అలరించాలి అంటే ఆ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి. అన్నిటిని మించి ఆసక్తికరమైన కథ ఉండాలి. ఒక బలమైన కథ ఉన్నప్పుడు సినిమా ఎక్కువ శాతం సక్సెస్ పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బలమైన కథ ఉండి కూడా ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.


కొన్ని సినిమాల్లో ఎటువంటి కథ లేకపోయినా చూపించే విధానం బాగుంటుంది. అలాంటి సినిమాలు అన్ని వేళలలో వర్కౌట్ అవుతాయని చెప్పలేము. ఇకపోతే ఆడియన్స్ అందరూ ఇప్పుడు ప్రపంచ సినిమాను చూడటం మొదలుపెట్టారు. ఓటిటిలోకి వెళ్లి వాళ్లకు నచ్చిన జోనర్ పైన క్లిక్ చేస్తే 10,20 సినిమాలు కు పైగా సజెషన్స్ వస్తున్నాయి. అలానే హర్రర్ సినిమాలు చూడటానికి కూడా ప్రాక్షకులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. హర్రర్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటేనే వర్క్ అవుట్ అవుతుంది.

ఇంకెన్ని రోజులు అవే దెయ్యాలు 

సుధీర్ బాబు నటించిన సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అంతా ఊహించిన విధంగానే లంకె బిందులు, దెయ్యాలు ఉన్నాయా లేదు అని కనుక్కోవడం, ఒక సందర్భంలో దేవునికి ఎదురు వెళ్ళటం. దేవుడు ఆ వ్యక్తికి సాయం చేయటం. ఈ అంశాలు మాత్రమే ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు చెప్పిన అంశాల మీద వచ్చిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక జటాధర సినిమా కూడా అలానే ఉంటే పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదు. అయితే ఈ సినిమాలో ఉన్న అంశాలను దాచి ట్రైలర్ ఇలా కట్ చేశారా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ కూడా ఊహించిన స్థాయిలో లేదు. చాలా నాసిరకంగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు విఎఫ్ఎక్స్ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అదే పరిస్థితి ఈ సినిమాకు కూడా జరిగే అవకాశం ఉంది.

సుధీర్ సక్సెస్ కొడతాడా 

మరోవైపు సుధీర్ బాబు చేసిన సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా సమ్మోహనం, హరోం హర సినిమా కూడా కొంతమేరకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే అద్భుతమైన సక్సెస్ సాధించిన సినిమా అంటూ ఇప్పటివరకు రాలేదు. ఆ సక్సెస్ జటాధర సినిమా ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో త్వరలో తెలుస్తుంది.

Related News

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Bigg Boss 9 Promo : నేను మీ పనోన్ని కాదు, రెచ్చిపోయిన గౌరవ్ గుప్తా, ఇదయ్య మీ అసలు రూపం

Bandla Ganesh: మళ్లీ సారీ చెప్పిన బండ్లన్న… అనాల్సినవి అన్ని అనేసి… ఇప్పుడు క్షమాపణలా?

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Big Stories

×