E-Paper
Advertisement

Gulika Kalam : గుళికకాలంలో ఆ పని చేస్తే తిరుగుండదా….?

Gulika Kalam : గుళికకాలంలో ఆ పని చేస్తే తిరుగుండదా….?
Advertisement

Gulika Kalam : భారతీయ ఆస్ట్రాలిజీ మరిచిపోయిన విషయం గుళికకాలం. ఈ విషయంపై ఇప్పుడు విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. మనదేశంలో పుట్టిన శాస్త్రంపై విదేశాల్లో గౌరవం పెరిగింది. ముహూర్తాలు చూసేటప్పుడు మన దగ్గర దుర్మూహర్తం, వర్జ్యం చూసుకుంటూ ఉంటారు. కానీ తమిళనాడులో రాహుకాలన్ని చూస్తుంటారు. గుళిళకాలంలో ఆశ్చరమైన ఫలితాలు వస్తాయని పెద్దలుచెబుతున్నారు. ప్రత్యేకించి గుళికకాలంలో అక్కడ షాపుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు బాగా జరుపుతుంటారు. ఆ కాలంలో అమ్మకాలు , కొనుగోళ్లు చేస్తే మంచిదన్న సెంటిమెంట్ అక్కడ బాగా ఉంది. గుళిక కాలంలో వస్తువు కొంటే మళ్లీ మళ్లీ ఆ వస్తువులు కొనే శక్తి కలుగుతుందని విశ్వాసం తమిళుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర మంగళవారం సెంటిమెంట్ ఉంటుందో..అక్కడ కూడా అలానే ఉంటుంది.

Advertisement

గుళికకాలం అనేది ప్రతీ వారం ఒకే సమయంలో వస్తూ ఉంటుంది. యాప్ ద్వారా కూడా మనం ఈవిషయాన్ని తెలుసుకోవచ్చు. తమిళనాడులో గుళికకాల దీపాన్ని పాటిస్తారు. సుబ్రహ్మణస్వామిని ఆరాధిస్తూ దీపాన్ని వెలిగించి ఒక్కో ఆటంకం తొలగిపోవాలని పూజ చేస్తారు. గణపతికి పూజ చేసి తర్వాత సుబ్రహ్మణ్వేశ్వర స్వామిని అష్టకం పఠించాలి. ఇది కూడా ఒక్కో వారం ఒక్కోరోజుకి ప్రాధాన్యం ఉంటుంది. ఒంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒక్కో సమస్య నివారణ ఒక్కో రోజు గుళికకాలంలో పూజ చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతారని శాస్త్రం చెబుతోంది. గుళిక కాలంలో దీపం వెలిగించేటప్పుడు ఎర్ర వత్తి వేసి వెలిగించాలి.

ఇంట్లో పిల్లలకి విద్యా సమస్యలున్నా, వ్యాపార ఆటంకాలతో ఇబ్బంది పడేవారు బుధవారం
నాడు గుళికకాలంలో ఆరాధన చేస్తే ఫలితాలు కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దైవానికి సంబంధించి కార్యాలు చేయాలనుకునే వారు గురువారం గుళిక దీపాన్ని వెలిగిస్తే పని నిర్విఘ్నంగా జరుగుతుంది. వివాహ సమస్యలు ఉన్న వారు శుక్రవారం నాడు గుళిక దీపాన్ని వెలిగిస్తే పరిష్కారమార్గాన్ని గుర్తిస్తారు. నిరుద్యోగులు శనివారం గుళిక దీపాన్ని వెలిగిస్తే అమ్మవారిని కూడా ఆరాధిస్తే త్వరలోనే ఉద్యోగస్తులవుతారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×