BigTV English

Sravana Masam 2025: శ్రావణ మాసంలో ఈ వస్తువులు దానం ఇస్తే.. జన్మ జన్మల పుణ్యం

Sravana Masam 2025: శ్రావణ మాసంలో ఈ వస్తువులు దానం ఇస్తే.. జన్మ జన్మల పుణ్యం

Sravana Masam 2025: శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో హిందువులు పూజలు, నోములు నిర్వహిస్తారు. అంతే కాకుండా ధాన దర్మాలు చేయడం వల్ల కూడా ఈ మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శివారాధన, ఉపవాసలు చేయడం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ మాసం శివుడికి చాలా ప్రీతి పాత్రమైనది కాబట్టి ఈ సమయంలో కూడా కొన్ని రకాల వస్తువులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా అనంతమైన పుణ్యం కూడా లభిస్తుంది. శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


శ్రావణ మాసంలో దానాల విశిష్టత:
శ్రావణ మాసం శివారాధనకు అత్యంత అనుకూలమైంది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, దానం, ధర్మం అనేక రెట్లు ఫలితాలను ఇస్తాయి. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం భగవంతుని ఆశీస్సులు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోమవారం రోజున శివుని పూజించి దానం చేయడం చాలా శ్రేష్టమైనది.

శ్రావణ మాసంలో దానం చేయాల్సిన వస్తువులు:
బియ్యం, పప్పు, ఆహార ధాన్యాలు:
శ్రావణ మాసంలో అన్నదానం చేయడం చాలా పుణ్యం. ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా పేదల ఆకలి తీర్చిన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయాల వద్ద లేదా పేదలకు అన్నదానం చేయడం ద్వారా శివుడి అనుగ్రహం పొందుతారు. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి, ఇంట్లో సుఖ శాంతులు నెలకొల్పడానికి తోడ్పడుతుంది.


వస్త్రాలు:
శ్రావణ మాసంలో కొత్త వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. ముఖ్యంగా సోమవారం నాడు బ్రాహ్మణులకు లేదా నిస్సహాయులకు తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దానం గ్రహ దోషాలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.

పాలతో చేసిన పదార్థాలు:
శివుడికి పాలు అంటే చాలా ప్రీతి. అందుకే శ్రావణ మాసంలో పాలు లేదా పాలుతో చేసిన పదార్థాలను దానం చేయడం చాలా మంచిది. పాలతో శివలింగానికి అభిషేకం చేయడం.. ఆ తర్వాత అదే పాలను పేదలకు దానం చేయడం ద్వారా భోళా శంకరుడి అనుగ్రహం లభిస్తుంది.

రుద్రాక్ష మాల:
రుద్రాక్ష శివుడికి సంబంధించినది. శ్రావణ మాసంలో ఒక శివ భక్తుడికి రుద్రాక్ష మాలను దానం చేయడం చాలా విశేషమైనది. దీనివల్ల శివుడి అనుగ్రహం లభించి, జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇది జపమాలగా ఉపయోగపడుతుంది కాబట్టి, ఆధ్యాత్మిక పురోగతికి కూడా సహాయపడుతుంది.

శ్రావణ మాస పూజా సామాగ్రి:
శివ భక్తులకు శ్రావణ మాసంలో పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులను దానం చేయవచ్చు. ఉదాహరణకు.. శివలింగం, బిల్వ పత్రాలు, గంధం, విభూతి, దీపాలు, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల శివారాధనలో పాలుపంచుకున్న పుణ్యం లభిస్తుంది.

Also Read: శ్రావణ మాసంలో పొరపాటున కూడా.. ఈ పనులు చేయొద్దు

నల్ల నువ్వులు:
నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పితృ దేవతల ఆశీర్వాదం లభిస్తుందని, అలాగే శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ దానాలను కేవలం పుణ్యం కోసమే కాకుండా, మనస్ఫూర్తిగా అవసరం ఉన్నవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తే దాని ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా దేవుని దృష్టిలో గొప్పదిగా భావించబడుతుంది

Related News

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Lord Ganesha: వినాయకుడికి.. ఈ వస్తువు సమర్పిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్

Big Stories

×