Sreeleela: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు లేదా హీరోయిన్లకు సక్సెస్ వస్తేనే తదుపరి అవకాశాలు వస్తుంటాయి. వరుసగా రెండు మూడు సినిమాలు సక్సెస్ కాలేదంటే వారికి సినిమా అవకాశాలు రావడం గగనం. కానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీ లీల(Sreeleela)కు మాత్రం హిట్లు లేకపోయినా ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన శ్రీ లీలా అనంతరం వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె కెరియర్ లో రెండు మూడు బ్లాక్ బస్టర్లు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలో లేవు.
కిస్సిక్ అంటూ..
ఇక చివరిగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీ లీల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమాలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్నారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఈమె ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
రణవీర్ సింగ్ సినిమాలో ఛాన్స్…
ఇలా ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే శ్రీ లీల మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)బాలీవుడ్ రెండో ప్రాజెక్ట్ లో రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటిస్తుండగా శ్రీ లీల హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలైతే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో సరైన సినిమాలు లేకపోయినా శ్రీ లలకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తెలుగులో ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర(Mass Jathara) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా పట్ల ఎన్నో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
కార్తీక్ ఆర్యన్ తో రిలేషన్..
ఇక ఈ సినిమాతోపాటు శ్రీ లీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఈమె రేడియో జాకీగా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులని జరుపుకుంటుంది. ఇలా సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో రిలేషన్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు సందర్భాలలో జంటగా కెమెరా కంటికి కూడా చిక్కడంతో ఈ వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు కానీ ఈ వార్తలపై ఎక్కడ శ్రీ లీల స్పందించలేదు.
Also Read: Kota Srinivas: కోటా మొహం పై కాండ్రించి ఉమ్మేసిన స్టార్ హీరో.. మరిచిపోలేని అవమానం?