E-Paper
Advertisement

Tathastu Devathalu : మంచిగా మాట్లాడమని అందుకే పెద్దోళ్లు చెప్పారా.

Tathastu Devathalu : మంచిగా మాట్లాడమని అందుకే పెద్దోళ్లు చెప్పారా.
Advertisement
Tathastu Devathalu

Tathastu Devathalu : మ‌న పురాణాల ప్ర‌కారం.. త‌థాస్తు దేవ‌త‌లు ఉంటారు. త‌థ‌ అంటే అప్ర‌కారంగా అస్తు అంటే జ‌ర‌గాల్సిందే అని అర్థం. మ‌నిషి ఏదైనా అన‌రాని మాటను ప‌దే ప‌దే అంటే త‌థాస్తు దేవ‌త‌లు వెంట‌నే త‌థాస్తు అంటారు. ఇలా త‌థాస్తు అనే వారినే త‌థాస్తు దేవ‌త‌లు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి సూర్యుని వేడిని భ‌రించ‌లేక గుర్రం రూపాన్ని దాల్చి కురు దేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. ఇలా వీరిద్ద‌రి క‌ల‌యిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు. వీరినే త‌థాస్తు దేవ‌త‌లని, దేవ‌తా వైద్యుల‌ని అంటారు.

వీరు ఎంతో వేగంగా ప్ర‌యాణిస్తూ ఉంటారట.. వీరు ప్ర‌యాణించే మార్గంలో త‌థాస్తు అనుకుంటూ, వేద మంత్రాల‌ను జ‌పిస్తూ ఉంటారు. య‌జ్ఞాలు, యాగాలు జ‌రిగే చోట వీరు ఎక్కువ‌గా సంచ‌రిస్తూ ఉంటారు. ఇత‌రుల మంచి కోరుకునే వారు ఎవ‌రైనా త‌థాస్తు అంటే అది క‌చ్చితంగా జ‌రుగుతుందట‌.

Advertisement

అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మ‌రో చేత్తో అభ‌య హ‌స్తాన్ని చూపిస్తూ తిరుగుతారు.. మ‌న గురించి మ‌నం ఏదైనా అనుకుంటే త‌థాస్తు దేవ‌త‌లు వెంట‌నే త‌థాస్తు అంటార‌ని.. వారు ఎక్కువ‌గా సంధ్యా స‌మ‌యంలో.. అంటే సాయంత్రం స‌మయంలో తిరుగుతూ ఉంటార‌ని న‌మ్ముతుంటారు. అందుకే మన పెద్దోళ్లు సాయంత్రం పూట ఏం మాటలు అవి అంటారు.. ఏదైనా మనం చెడుగా, వింతగా మాట్లాడితే..!

తదాస్థు దేవతలు తిరిగే సమయంలో మ‌న ద‌గ్గ‌ర ధ‌నం లేదు అనుకుంటే లేకుండానే పోతుంద‌ట‌. మ‌న గురించి, ఇత‌రుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇత‌రుల‌కు హాని చేయ‌కుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి ప‌నుల‌కు మాత్ర‌మే దేవ‌త‌లు త‌థాస్తు అంటార‌ట‌.

Advertisement

ఎవ‌రైనా మ‌న‌కు అన్యాయం చేసిన‌ప్పుడు మ‌నం ప‌దే ప‌దే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. త‌థాస్తు దేవ‌త‌లు ఈ మాట‌ల‌ను విని త‌థాస్తు అంటార‌ట‌. దీంతో మ‌న‌కు అన్యాయం చేసిన‌ వారి ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంది. అందుకే ఎవరి గురించైనా …మ‌న‌ గురించైనా మ‌నం చెడుగా మాట్లాడుకోకూడ‌దు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాల్లో చెబుతున్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×