BigTV English

Ubili Basavanna:- శ్రీశైలంలో ఉబిలి బసవన్న జాడ కనిపిస్తోందా….

Ubili Basavanna:- శ్రీశైలంలో ఉబిలి బసవన్న జాడ కనిపిస్తోందా….

Ubili Basavanna:- శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి ఆలయం కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు.


శిల్పి నక్త వ్రతాన్నిపాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలని తెగ మదనపడ్డాడు. మధ్యలో పాతాళగంగను ఎలా దాటాలా అని ఆలోచించాడు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు.

“భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది.ఇవిగో ఈ పలుపు తాళ్లను నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో..” వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి. వెంటనే వాటిని నందుల మెడలకు తగిలించి శ్రీశైలానికి బయల్దేరాడు. తెల్లవారయ్యే సరికి పాతాళగంగను చేరుకుని కృష్ణానదిని దాటే ప్రయత్నంలో ఉన్నాడు.


రెండో ఒడ్డుకు చేరబోతున్న సమయంలో ఒక నంది ముందు మరోటి వెనక ఉండిపోయింది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ళ మధ్య ఇరుక్కుని ఆగిపోయింది. శిల్పి కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు . అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి, మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నంది తోనే శ్రీశైలం చేరాడు.

ఇప్పుడు. శ్రీశైలంలో కనిపించే నంది. ఆ శిల్పి చేసినదే. ఇదంతా స్థానికులు చెబుతుంటారు. మరి ఊబినుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఏమైందన్న సందేహాలు సమాధానం చెప్పడానికి ఉబ్బలి బసవన్న సిద్ధంగా ఉంటాడు . మొన్నా మధ్య మధ్య భక్తులకు దర్శన మిచ్చిన ఆ బసవన్న శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల పాతాళ గంగలో మునిగిపోయాడు. ఇప్పుడు ఆ నంది దర్శనం 700 అడుగుల లోతులో చేసుకోవచ్చు .

ఒంటికాలిపై పార్వతి దేవి తపస్సు చేసిన గుడి

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×