BigTV English

Ganapati:- ఇంటి ముందు గణపతిని ఎందుకు ప్రతిష్టించాలి

Ganapati:- ఇంటి ముందు గణపతిని ఎందుకు ప్రతిష్టించాలి

Ganapati:– వినాయకుడు విఘ్న నాశకుడు. అంతేనా , చెడు దృష్టి నుండీ కూడా రక్షించే రక్షకుడు. సిద్ధిని, బుద్ధిని అనుగ్రహించే వరదుడు. అందుకే, ఇంటినుండీ బయటికి వెళ్లేప్పుడు ఆయనకి నమస్కారం చేసుకొని వెళితే శుభం జరుగుతుంది . హిందూ పురాణాల ప్రకారం, గణేశుడిని ఆనందం ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. గృహాల రక్షకుడు అని నిత్యమూ వినాయకుని అర్చనలు జరిగే చోట చక్కగా సిద్ధాసనంలో కూర్చొని అన్ని వ్యవహారాలు సరిగ్గా జరిగేలా చక్కబెడతారు .


మనం ఎవరినైనా పిలిచి గౌరవంగా చూసుకుంటేనే కదా మన ఇంట ఉండి మన కష్టసుఖాలలో పాలు పంచుకుంటారు . కనుక ఆయన చెక్కతో చేసిన రూపాన్ని మన ఇంటి గుమ్మం దగ్గర ఉండేలా ఏర్పాటు చేసి , ప్రతిరోజూ స్నానం చేశాక , ఆయనకి సింధూరాన్ని తిలకంగా పెడుతూ,అగరవత్తులు వెలిగించి ధూపం వేయండి . భక్తిగా నమస్కారం చేసుంటే చాలు . మన ఇంట్లో నిత్యమూ శుభాలు జరిగేలా ఆ గణపతి అనుగ్రహిస్తారు . ఇంట్లో గణేశుడి విగ్రహం గానీ ఉంచాలనుకుంటే ఇంటికి ఎడమవైపున మాత్రమే పెట్టి పూజించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అదే కుడివైపు పూజించడంలో ప్రత్యేక నియమాలను అననుసరించాల్సి ఉంటుంది. ఆ నియమాలు పాటించడం కుదరకపోవడం చేత ఎడమ వైపున శివుడి కుమారుడు అయిన గణనాథుడిని ప్రతిష్టించుకోవాలి.

ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు, అది కూర్చున్న లేదా పడుకున్న విగ్రహాం అయి ఉండాలి.గణేశుడి రూపాన్ని ప్రకృతిలోని పంచభూతాలలో దేనిలోనైనా దర్శించవచ్చు. ఆకులు, పూవులు, నీటి ధారలు , మబ్బు తునకలు , అగ్ని కీలలు ఇలా దర్శించే హృదయం ఉండాలి. కానీ, ఆ గణపయ్య కనిపించని చోటే ఉండదు . సదా రక్షకుడు గజాననుడు. ఆయన ఉన్న చోట సదా శుభాలే జరుగుతాయని శాస్రం.


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×