CDAC Recruitment: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతన అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: దరఖాస్తుకు లాస్ట్ డేట్: అక్టోబర్ 20
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, నోయిడా, పుణె, తిరువనంతపురం, గువాహటి సెంటర్ లలో 646 ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 646
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
సెంటర్ల వారీగా వెకెన్సీ వివరాలు…
బెంగళూరు: 110 పోస్టులు
చెన్నై: 105 పోస్టులు
హైదరాబాద్: 65 పోస్టులు
కోల్ కతా: 6 పోస్టులు
ముంబై: 12 పోస్టులు
నోయిడా: 173 పోస్టులు
పూణె: 99 పోస్టులు
తిరువనంతపురం: 54 పోస్టులు
సీఐఎన్ఈ గౌహతి: 22 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 20
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే దరఖాస్తు ఫీజు అవసరం లేదు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://cdac.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 646
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20