Rishabh shetty: రిషబ్ శెట్టి(Rishabh Shetty) ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మారుమోగుతున్న పేరు. కన్నడ చిత్ర పరిశ్రమలు దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన కాంతార (Kantara) సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలోఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతారా చాప్టర్ 1(Kantara Chapter1) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా యూనివర్స్ నుంచి మరికొన్ని భాగాలు కూడా ప్రేక్షకుల ముందుకు కాబోతున్నాయని దర్శకుడు రిషబ్ శెట్టి వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి కాంతార కథ ఎలా పుట్టింది? ఈ కథ రాయడం వెనుక గల సంఘటనల గురించి తెలియజేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి కాంతార సినిమాకు మూలం ఏంటి? ఏ సంఘటన ఇలాంటి సినిమా చేయడానికి దోహద పడింది అనే విషయానికి వస్తే..
ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ..”20 సంవత్సరాల క్రితం మా గ్రామం కెరాడిలో వ్యవసాయ భూమి కోసం అటవీ అధికారులకు రైతులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘర్షణను తాను ప్రకృతిని కాపాడే వారి పోరాటంగా చూసా,మా సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించి కాంతార కథను రాశానని” ఈ సందర్భంగా రిషబ్ శెట్టి కాంతార కథ రాయాలనే ఆలోచన ఎలా పుట్టిందో తెలియజేశారు. ఇలా నిజజీవితం సంఘటన ఆధారంగా కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
హనుమంతుడి పాత్రలో రిషబ్..
ఇక కాంతార సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో రిషబ్ శెట్టి ఈ యూనివర్స్ నుంచి మరిన్ని భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక కాంతార చాప్టర్ వన్ కూడా మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ సినిమాని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇలా కాంతార సినిమాలతో పాటు రిషబ్ ఇతర సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక ఈయన తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.