Rajinikanth in Himalayas: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి హిమలయాలకు వెళ్లారట. ప్రస్తుతం ఆయన హిమలయాల్లో సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ లో ఉండాల్సిన ఆయన హిమలయాలకు వెళ్లడం హాట్టాపిక్గా మారింది. రజనీకాంత్ చివరిగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఓవర్ హైప్ వల్ల సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది. నిజానికి మూవీ బాగుందనే టాక్ వచ్చినా.. ఓవర్ హైప్ మూవీని కమర్షియల్ ఫెయిల్ చేసింది. దీంతో కోలీవుడ్కి తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. దీంతో రజనీకి, కోలీవుడ్ కి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం రజనీ జైలర్ 2 మూవీ చేస్తున్నాడు. చివరిగా ఆయన జైలర్తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ని ప్రకటించారు. కూలీ సినిమా వల్ల ఆలస్యమైన ఈ సీక్వెల్ రజనీ ఇటీవల సెట్స్పైకి తీసుకువచ్చారు. రీసెంట్ కేరళ షెడ్యూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ రజనీ బ్రేక్ ఇచ్చి హిమలయాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రిషికేష్లోని ఆశ్రమంలో సేద తీరుతున్నారు.
రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే విషయం తెలిసిందే. బాబా భక్తుడైన ఆయన ప్రతి ఏడాది హిమలయాలకు వెళ్తుంటారు. వారం రోజులు పాటు అక్కడి రిషికేష్ ఆశ్రమంలో బస చేసి చూట్టు పక్కల ఉన్న పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏడాది ఆయన హిమలయాల్లోని బాబా గుహలను సందర్శిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆయన బాబా గుహలను సందర్శించేందుకు వెళ్లారు. జైలర్ 2 సినిమా షూటింగ్ కి వారం రోజులు బ్రేక్ ఇస్తూ.. హిమలయాలకు వెళ్లిన ఆయన అక్కడ బద్రినాథ్ వంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో రిషికేష్ ఆశ్రమమంలో ఆయన సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జైలర్ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కముఆర్, జాకీ ఫ్రాఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీక్వెల్ కి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్జే సూర్య సైతం ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 12న జైలర్ 2ని విడుదల చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో షూటింగ్ చక చక పూర్తి చేసే పనిలో ఉంది మూవీ టీం. ఈ నేపథ్యంలో జైలర్ 2కి బ్రేక్ పడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా రజనీ హిమలయాలకు వెళ్లిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. మూవీ షూటింగ్ బ్రేక్ కారణం వెల్లయ్యింది.