Rukmini Vasanth Father: కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. తాజాగా ఈమె తండ్రి కల్నల్ వేణుగోపాల్ వసంత్ (Venugopal Vasanth) గారిని అత్యున్నత పురస్కారంతో సత్కరించబడింది. కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత దేశ సైన్యంలో విశిష్టమైన సేవలను అందిస్తూ అమరుడయ్యారు. ఈయన పఠాన్ కోట్, సిక్కిం, రాంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో విధులను నిర్వర్తించారు. రుక్మిణి వసంత్ ఏడు సంవత్సరాల వయసులోనే భారతదేశాన్ని ఉగ్ర మూక నుంచి కాపాడే నేపథ్యంలో ఆయన తన ప్రాణాలను అర్పించారు.
2007వ సంవత్సరం ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ భారీ ఆయుధాలతో ఇండియాలోకి చొరబడకుండా కల్నల్ వసంత్ అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్ లో ఈయన నాయకత్వం వహిస్తూ పాకిస్తాన్ వారు ఇండియాలోకి చొరబడకుండా అడ్డుకోవడంలో తన ప్రాణాలను కోల్పోయారు. తన శరీరంలో ఏడు బుల్లెట్లు దిగిన దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకు శత్రువులతో పోరాడుతూ చివరికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ అమరుడయ్యారు. ఇలా దేశ రక్షణ కోసం వేణుగోపాల్ వసంత్ అసాధారణ ధైర్య సాహసాలను గుర్తిస్తూ కల్నల్ వసంత్ మరణాంతరం ఆయనకు అశోక చక్ర(Ashoka Chakra) పురస్కారంతో గౌరవించారు. ఈ పురస్కారం దేశంలోనే అత్యున్నత శాంతి సమయ శౌర్య పురస్కారం.
ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి మొదట భారతదేశ సైనికుడిగా వేణుగోపాల్ వసంత్ ఎంపిక అయ్యారు. భారత సైన్యంలో కొనసాగుతూ దేశ రక్షణలో భాగంగా ఈయన చేసిన ధైర్య సాహసాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పాలి. కల్నల్ వసంత్ మరణాంతరం ఆయన సతీమణి సుభాషిణి వసంత్ వీర రత్న ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా యుద్ధ వీరుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా సుమారు 120 కుటుంబాల పిల్లలకు సహాయాన్ని అందించారు.
సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా..
ఇలా ఒక గొప్ప కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన రుక్మిణి వసంత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక కెరియర్ పరంగా ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల మదరాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం కాంతర 1 సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కాంతార 1 సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రుక్మిణి పేరు మార్మోగిపోతుంది.