BigTV English

Lakshmi Kataksha:ఫాల్గుణి మాసంలో లక్ష్మీదేవత కటాక్షం

Lakshmi Kataksha:ఫాల్గుణి మాసంలో లక్ష్మీదేవత కటాక్షం

Lakshmi Kataksha:శ్రీమహా విష్ణువుకు ఇష్టమైన మాసాలలో ఫాల్గుణమాసం ఒకటి. ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది. విష్ణు దేవునికి ఇష్టమైన మాసం ఇదేనని భాగవతం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు ‘పయోవ్రతం’ ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది.


ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు ‘పయోవ్రతం’ ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది.

వసంత పంచమి నుండి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగులో పలుకరిస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.


ఫాల్గుణ పూర్ణిమ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Sheethala Devi Pooja:శీతల దేవతకు ఎలాంటి పూజ చేయాలి…?

Lord Krishna Foot:తెలంగాణలో శ్రీకృష్ణుడు పాదం మోపిన ప్రాంతం ఎక్కడుంది

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×