E-Paper
Advertisement

Fridge Direction:కొత్తగా ఫ్రిడ్జ్ కొనేవారు ఇంట్లో ఈదిశలో పెట్టారా……

Fridge Direction:కొత్తగా ఫ్రిడ్జ్ కొనేవారు ఇంట్లో ఈదిశలో పెట్టారా……
Advertisement

Fridge Direction:ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ కామన్ గా మారిపోయింది. వేసవి కాలం సమీపిస్తున్న వేళ ఫ్రిడ్జ్ లేని వాళ్లు తీసుకోవడానికి సిద్దమవుతుంటారు. చల్లని పదార్ధాలతోపాటు కూరగాయలు నిల్వచేసుకోవడానికి ఫ్రిడ్జ్ అవసరమవుతుంది. ఫ్రిడ్జ్ లాంటి వస్తువును తీసుకునేటప్పుపుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తామో…దాన్ని ఇంట్లో పెట్టే సమయంలో కూడా అలాంటి జాగ్రత్తే పాటించాలి. అదే ఉండే స్థానం ఇంటి వాస్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇంట్లో ఫ్రిజ్‌ను ఎక్కడ అమర్చాలి:
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఫ్రిజ్‌ను ఉంచే విషయంలో తలో మాట చెబుతుంటారు. ఫ్రిడ్జ్ లో వేడి , కరెంటు ఉంటుంది.అందు వల్ల ఆగ్నేయంలోనే పెట్టాలని అంటూ ఉంటారు. అందులో పెట్టే పదార్దాలను చల్లగా ఉంచుతుంది కాబట్టి ఈశాన్యంలో పెట్టాలని మరికొందరు సలహా ఇస్తుంటారు. వాయువ్యంలో పెట్టాలని ఇంకొందరూ చెబుతూ గృహస్తుల్ని గందరగోళ పరుస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం, ఈశాన్యం,తూర్పు, ఉత్తరం, ఈ భాగాల్లో తప్ప ఇంట్లో మరెక్కడైనా రిఫ్రిజరేటర్ పెట్టుకోవచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో తప్పు మిగిలిన ప్రాంతంలో మీకు అనుకూలమైన చోట పెట్టుకోవచ్చు.

Advertisement

అలా ఎలా పెట్టాలి
ఫ్రిడ్జ్ అనుకూలమైన దిశలోనే పెట్టడమే కాదు. ఎటు వైపు నుంచి డోర్ తెరుస్తామన్నది కూడా వాస్తులో ముఖ్యమైన అంశంగానే పరిగణించాలి. ఉత్తరం చూస్తూ ఉత్తరం గోడ తగలకుండా రిఫ్రిజరేటర్ పెట్టుకోవచ్చు. తూర్పు దిక్కున చూస్తూ తూర్పు గోడ తగలకుండా కూడా ఇంట్లో అమర్చుకోవచ్చు. అలాగే తూర్పు ఆగ్నేయంలో తూర్పును మనం చూసేలా తూర్పుగోడను ఫ్రిడ్జ్ తాకకుండా ఉంచుకోవచ్చు .ఉత్తర వాయువ్యంలో ఉత్తర దిక్కును చూస్తూ ఉత్తర గోడ వైపు కూడా ఎలక్ట్రానిక్ వస్తువు పెట్టుకోవచ్చు.

వంట ఇంటిలో ఈదిక్కున బెటర్
వంట గది ద్వారం ఉత్తర దిక్కున వైపు ఉంటే ఆ ద్వారం పక్కన వంటగది వాయవ్యం వైపు దక్షిణాది ముఖంగా తెరిచే ఫ్రిడ్జ్ ఉంచడం శ్రేష్టమైందని పండితులు సూచిస్తున్నారు. రిఫ్రిజరేటర్ ఉంచడానికి ఉత్తమ దిక్కు వాయువ్య దిశ. అలాగే ఆగ్నేయ దిశ కూడా సహేతుకమైనది.

Advertisement

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ

Tuesday:మంగళవారం ఈ ఒక్క పని చేయద్దు

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×