BigTV English

Lucky Vehicle Numbers: మీ పుట్టినతేదీ ప్రకారం మీకు అదృష్టాన్ని తీసుకు వచ్చే వెహికిల్  నెంబర్, కలరు ఎలా ఉండాలో తెలుసా…?

Lucky Vehicle Numbers: మీ పుట్టినతేదీ ప్రకారం మీకు అదృష్టాన్ని తీసుకు వచ్చే వెహికిల్  నెంబర్, కలరు ఎలా ఉండాలో తెలుసా…?

Lucky Vehicle Numbers: కొత్తగా వెహికల్‌ కొంటున్నారా.. మీ పుట్టినతేదీకి సరిపోయే వెహికిల్‌ నెంబర్స్‌ ఏవో తెలియదా..? అయితే మీలాంటి వారి కోసమే ఈ కథనం. మీ పుట్టినతేదీ ఆధారంగా మీ వెహికిల్‌ కు ఎలాంటి నెంబర్‌ సరిపోతుంది. ఎలాంటి కలర్‌ వెహికిల్‌ మీకు కలిసొస్తుంది. ఇంకా వెహికిల్‌ ఏ రోజు డెలివరీ తీసుకుంటే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం.


ఒకటవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారు ఒకటవ నెంబర్‌ వ్యక్తులు అవుతారు. వీరు వెహికిల్‌  నెంబర్‌ ప్లేట్‌ లో ఒకటి, నాలుగు, ఏడు అంకెలు ఉండేలా చూసుకోవాలి. అలాగే పసుపు, గోల్డ్‌ కలర్‌లో ఉండే వెహికిల్‌ వీరికి కలిసొస్తుంది. అలాగే మీ నెంబర్‌ ప్లేట్‌లో ఆరు, ఎనిమిది అంకెలు ఉండకూడదు. నలుపు, నీలం, పర్పుల్‌ కలరు వెహకిల్‌ మీకు అచ్చి రాదు. ఇక ఆదివారం వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.

రెండవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలో నైనా రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది  తేదీలలో పుట్టిన వారు రెండవ నెంబర్‌ వ్యక్తులు అవుతారు. వీరి వెహికిల్‌ నెంబర్‌ ప్లేట్‌లో ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది అంకెలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వెహికిల్‌ తెలుపు, లైట్‌ షేడ్స్‌ కలర్‌ ఉండాలి. ఇక వీరి నెంబర్‌ ప్లేట్‌లో తొమ్మిది, ఎరుపు, పింక్‌ కలర్స్ ఉండకూడదు. ఇక ఆదివారం, సోమవారం వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.


మూడవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలో నైనా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముప్ఫై తేదీలలో పుట్టిన వారిని మూడవ నెంబర్‌ వ్యక్తుల అంటారు. వీరు తమ వెహికిల్‌ లో మూడు, ఆరు, తొమ్మిది అంకెలు, పర్పుల్‌, పింక్‌ కలర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఐదు, ఎనిమిది నెంబర్లు, గ్రీన్‌, వైట్‌, బ్రౌన్‌ కలర్‌ లేకుండా చూసుకోవాలి. వీరు గురువారం, శుక్రవారం, మంగళవారం వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.

నాలుగవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముఫ్పై ఒకటి తేదీలలో పుట్టిన వారిని నాలుగవ నెంబర్‌ వ్యక్తులు అంటారు. వీరు తమ వెహికిల్‌ నెంబర్‌లో ఒకటి, నాలుగు అంకెలు, నీలం, బ్రౌన్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆరు, ఎనిమిది, తొమ్మిది నెంబర్లు, బ్లాక్‌, పింక్‌ కలర్సు లేకుండా చూసుకోవాలి. అలాగే వెహికిల్‌ డెలివరీ శని, ఆది, సోమ వారాలు తీసుకుంటే మంచిది.

ఐదవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వారిని ఐదవ నెంబర్‌ వ్యక్తులుగా పరిగణించాలి. వీరు ఐదవ సంఖ్యను తమ వెహికిల్ నెంబర్‌ ప్లేట్‌ లో ఉండేలా చూసుకోవాలి. అలాగే లైట్‌ గ్రీన్‌, వైట్‌, బ్రౌన్‌ కలర్స్‌ అచ్చొస్తాయి. ఇక మూడు, ఎనిమిది, తొమ్మిది అంకెలు, బ్లాక్, పింక్‌ కలర్స్‌ లేకుండా చూసుకోవాలి. ఇక బుధ, గురు, శుక్ర వారాలలో వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.

ఆరవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుడితే వారిని ఆరవ నెంబర్‌ వ్యక్తులు అంటారు. వీరు తమ వెహికిల్‌ నెంబర్‌ ప్లేట్‌ లో మూడు, ఆరు, తొమ్మిది అంకెలు, లైట్‌ బ్లూ, పసుపు, పింక్‌ కలర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అలాగే నాలుగు, ఎనిమిది నెంబర్లు, బ్లాక్‌ కలర్‌ లేకుండా చూసుకోవాలి. ఇక మంగళ, గురు, శుక్ర వారాలు వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.

ఏడవ నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా ఏడు, పదహారు, ఇరవై ఐదు తేదీలలో పుడితే వారిని ఏడవ నెంబర్‌ వ్యక్తులు అంటారు. వీరు తమ వెహికిల్‌ నెంబర్‌ ప్లేట్‌ లో ఒకటి, నాలుగు, ఏడు అంకెలు, నీలం, వైట్‌ కలర్స్‌ ఉంటే కలిసొస్తుంది. అలాగే ఎనిమిది, తొమ్మిది అంకెలు, బ్లాక్‌, పసుపు, కలర్స్‌ కలిసిరావు. ఇక ఆది, సోమ వారాలు డెలివరీ తీసుకుంటే మంచిది.

ఎనిమిద నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుడితే వాళ్లు ఎనిమిదవ నెంబర్‌ వ్యక్తులు అవుతారు. వీరు తమ వెహికిల్ నెంబర్‌ ప్లేట్‌ లో ఎనిమిది సంఖ్య ఉండేలా చూసుకోవాలి. బ్లాక్‌, నీలం, పర్పుల్‌ రంగు వెహికిల్‌ తీసుకోవాలి.  అలాగే ఒకటి, నాలుగు అంకెలు లేకుండా.. ఎరుపు, పింక్ కలర్‌ ఉండకుండా చూసుకోవాలి. ఇక శని, ఆది, సోమవారాలు డెలివరీ తీసుకుంటే మంచిది.

తొమ్మిదో నెంబర్‌ వ్యక్తులు: ఏ నెలలోనైనా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుడితే వారిని తొమ్మిదో నెంబర్‌ వ్యక్తులు అంటారు. వీరు డార్క్‌ రెడ్‌, పింక్‌ కలర్‌ ఉన్న వెహికిల్స్‌ తీసుకోవాలి. అలాగే నెంబర్‌ ప్లేట్‌లో మూడు, ఆరు, తొమ్మిది అంకెలు ఉండేలా చూసుకోవాలి. ఇక ఐదు, ఏడు నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. బ్లాక్‌, డార్క్‌ బ్లూ కలర్స్‌ ఉండకూడదు. వీరు మంగళ, గురు, శుక్రవారాలు వెహికిల్‌ డెలివరీ తీసుకుంటే మంచిది.

ముఖ్య గమనిక:  పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×