BigTV English

OTT Movie : పిల్లాడిని కిడ్నాప్ చేసి వింత మాస్కులతో భయపెట్టే సైకో… అక్కడ ఆత్మలు చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : పిల్లాడిని కిడ్నాప్ చేసి వింత మాస్కులతో భయపెట్టే సైకో… అక్కడ ఆత్మలు చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : హారర్ జానర్ లో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి రకరకాల కంటెంట్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ జనర్లలో ఒక వైపు భయపెట్టే సినిమాలు, మరోవైపు కడుపుబ్బా నవ్వించే సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఒక సైకో కిల్లర్ విచిత్రమైన మాస్క్ లను ధరించి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి చంపుతుంటాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఫిన్నీ షా అనే 13 ఏళ్ల బాలుడ్ని, ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అయిన ‘ది గ్రాబర్’ కిడ్నాప్ చేస్తాడు. ఈ కిల్లర్ ఇంతకు ముందు ఐదుగురు పిల్లలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపాడు. ఈ క్రమంలోనే ఫిన్నీని ఒక రహస్యమైన బేస్‌మెంట్‌లో బంధిస్తాడు. అక్కడ ఒక డిస్‌కనెక్ట్ అయిన బ్లాక్ ఫోన్ ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆ ఫోన్ ద్వారా గ్రాబర్ చేతిలో చినిపోయిన ఆత్మలు ఫిన్నీకి కనబడతాయి. ఇదంతా చూసిన ఫిన్నీ ఒక్క సారిగా షాక్ అవుతాడు. తరువాత అసలు విషయం తెలిసి ధైర్యం తెచ్చుకుంటాడు. ఈ ఆత్మలు గ్రాబర్ నుండి తప్పించుకోవడానికి ఫిన్నీకి సహాయం చేయాలని చూస్తాయి. వీళ్ళు గ్రాబర్‌ను ఎదుర్కోవడానికి సలహాలు కూడా ఇస్తారు.


ఇంతలో ఫిన్నీ సోదరి గ్వెన్ తన తమ్ముడిని కనిపెట్టడానికి. తనకు ఉన్న శక్తుల ద్వారా సమాచారం సేకరిస్తూ పోలీసులకు సహాయం చేస్తుంది. ఇక ఫిన్నీ ఆత్మల సహాయంతో, గ్రాబర్‌ను ఒక ఉచ్చులో ఇరికించి అక్కడి నుంచి బయటపడాలని చూస్తాడు. చివరికి ఫిన్నీ సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకుంటాడా ? ఆ కిల్లర్ పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు ? ఆత్మలు ఎలా ఫిన్నీకి సహాయం చేస్తున్నాయి? ఫిన్నీ సోదరికి ఉన్న శక్తులు ఎటువంటివి ?  అనే విషయాలను తెలుసుకోవాలి అనుకునంటే, ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమెరికాలో సెటిల్ కావాలనుకునే ఫ్యామిలీ… సుద్దపూసలు చూడాల్సిన డార్క్ కామెడీ సిరీస్

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది బ్లాక్ ఫోన్’ (The black phone). 2021 లో వచ్చిన ఈ సినిమాకి స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో మడేలిన్ మెక్‌గ్రా, జెరెమీ డేవిస్, జేమ్స్ రాన్సోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జో హిల్ రాసిన ఒక చిన్న కథ ఆధారంగా రూపొందింది. ఈ స్టోరీ 1970 ల నాటి కాలంలో జరుగుతుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio hotstar) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

Big Stories

×