PBKS Fans : పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నిన్న రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 14.1 ఓవర్ లో101 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 10 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. ఇక పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిస్ 26 పరుగులు అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ కావడం విశేషం. మిగతా బ్యాటర్లు అంతా తక్కువ స్కోరు చేసి ఔట్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లలో ఓపెనల్ సాల్ట్ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రాం రాజ్ కాటన్ అంటూ ట్రోలింగ్..
విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19 ఔట్ అయినప్పటికీ రజత్ పాటిదార్ 15 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిచిన విషయం అటు పక్కకు పెడితే.. మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే..? తెల్లని డ్రెస్ లో అందాల బామలు ఆసక్తికరంగా ఈ మ్యాచ్ ని వీక్షించారు. వారు ధరించిన డ్రెస్ డ్రెస్ రామ్ రాజ్ కాటన్ అని.. రామ్ రాజ్ కాటన్ బనియన్స్ వేసుకొని మ్యాచ్ వీక్షించారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ గతంలో రామ్ రాజ్ కాటన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కి చేరుకుంది. పంజాబ్ జట్టు తొలి స్థానంలో ఉండటంతో మరో ఛాన్స్ ఉంది. ముంబై-గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన వారితో పంజాబ్ జట్టు తలపడనుంది.
ఆ రెండు జట్లలో విజయం సాధించిన జట్టుతో జూన్ 03న ఫైనల్ లో తలపడనుంది. మరోవైపు ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ చేసిన సిగ్నల్స్ వివాదస్పందంగా మారాయి. పంజాబ్ కింగ్స్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ముషీర్ ఖాన్ ను ఉద్దేశించి వాటర్ బాటిల్స్ అందించేవాడు బ్యాటింగ్ కు వచ్చాడు అని కోహ్లీ హేళన చేశాడని కొందరూ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ముషీర్ పై కోహ్లీ పై అలాంటి ఉద్దేశం లేదని.. గత మ్యాచ్ లో అతడికి బ్యాట్ ను గిప్ట్ గా ఇచ్చాడని విరాట్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందిస్తూ.. చిన్న స్వామి స్టేడియం కాదు.. ఎక్కడికి వెళ్లినాహోంగ్రౌండ్ లా ఫీలయ్యేలా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి వారు చూపిస్తున్న అభిమానం అద్భుతమనే చెప్పాలి. వీఆల్ లవ్ యూ.. ఇంకొక్క మ్యాచ్.. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
Ramraj Baniyan in the stand. pic.twitter.com/iHxxiLGaaz
— Mufatball vishal (@Vishal_1589) May 29, 2025