BigTV English

Margasira Masam Special Pooja : మార్గశిరలో మాసంలో చేసే ప్రతీ పూజ విష్ణుభగవానుడే చేరుతుందా..

Margasira Masam Special Pooja :  మార్గశిరలో మాసంలో చేసే ప్రతీ పూజ విష్ణుభగవానుడే చేరుతుందా..

Margasira Masam Special Pooja : మార్గశిర మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే . మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. మార్గశిర శుద్ధషష్ఠి* *సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు.
మార్గశిర శుద్ధేకాదశి శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ధపూర్ణ శ్రీ దత్తజయంతి. దీనినే కోరలపూర్నిమ అంటారు. మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మివారం గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం.
మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది


సాక్షాత్తు విష్ణు భగవానుడు మార్గశిరం అంటే నేనే అని స్వయంగా భగవద్గీతలో తెలియజేశాడు.మృగశిరా నక్షత్రంతో కూడి మార్గశిర మాసంలోకి ప్రవేశించడం వల్ల ఈనెల అందు ఎక్కువ చలి ప్రారంభమయ్యే ఈ నెల అని చెప్పవచ్చు.ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో పూజలు నిర్వహించడానికి ఉపాసన కాలం ఎంత ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అంటే పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం,వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనదని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు. మార్గశిర మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహంతో ఆ కార్యాలను నిర్వహిస్తారు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×