BigTV English

SAIL : సెయిల్ లో మేనేజర్‌ పోస్టులు…దరఖాస్తులకు ఆహ్వానం..

SAIL : సెయిల్ లో మేనేజర్‌ పోస్టులు…దరఖాస్తులకు ఆహ్వానం..

SAIL : ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ రవుర్కెలాలోని సెయిల్‌ ప్లాంటు, ఒడిశా గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌లో 17 మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బాయిలర్ ఆపరేషన్ మేనేజర్ పోస్టులు 9 , ప్రాజక్టుల మేనేజర్ పోస్టులు 4, ఆటోమేషన్ మేనజర్ పోస్టులు 4 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పని అనుభవం పరిగణనలోకి తీసుకుంటారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 14 వరకు గడువు ఉంది.


  1. మేనేజర్‌ (బాయిలర్‌ ఆపరేషన్‌): 09 పోస్టులు
  2. మేనేజర్‌ (ప్రాజెక్టులు): 04 పోస్టులు
  3. మేనేజర్‌ (ఆటోమేషన్‌): 04 పోస్టులు
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం
    వయసు: 14/12/2022 నాటికి మేనేజర్‌- బాయిలర్‌ ఆపరేషన్‌ పోస్టులకు 37 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు
    జీత భత్యాలు: రూ.80,000 – రూ.2,20,000
    ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా
    దరఖాస్తు రుసుం: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.200)
    దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (పి అండ్‌ జి), బ్లాక్‌ ఇ, గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌, రవుర్కెలా, ఒడిశా చిరునామాకు పంపించాలి.
    దరఖాస్తులకు చివరి తేదీ: 14.12.2022.
    వెబ్‌సైట్‌:https://sail.co.in


Tags

Related News

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

SSC SI: 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్ కొడితే ఫ్యామిలీ అంతా సెట్, క్లియర్‌కట్ వివరాలు ఇదిగో..

APMSRB: రాష్ట్రంలో రూ.1,51,370 జీతంతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్టే, పూర్తి వివరాలివే

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..

Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..

IB Recruitment: టెన్త్ క్లాస్‌తో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. రూ.69,100 జీతం, దరఖాస్తుకు ఇంకా 3రోజులే

Big Stories

×