BigTV English

Mars Transit in Taurus : వృషభరాశిలోకి కుజుడి ప్రవేశం.. ఈ ఐదు రాశులవారికి ఊహించని ప్రయోజనాలు

Mars Transit in Taurus : వృషభరాశిలోకి కుజుడి ప్రవేశం.. ఈ ఐదు రాశులవారికి ఊహించని ప్రయోజనాలు

Mangal Gochar 2024 : కుజుడు ఈవారం వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ వారమే ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభమవ్వడంతో.. దుర్గామాత ఆశీస్సులు ద్వాదశ రాశులపై ఉంటాయి. కుజుడు రాశి మారుతుండటంతో.. 5 రాశుల వారిని అదృష్టం వరించనుంది. వారంతా ఊహించని ఫలితాలను పొందబోతున్నారు.


పరశురామ అష్టమితో ఆషాఢ నవరాత్రులు ముగియనున్నాయి. అలాగే నేడు చంద్రుడు కర్కాటక రాశి నుంచి బయల్దేరి.. జూలై 18కి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అలాగే జులై 12న అంగారక సంచారం జరగనుంది. శుక్రవారం రాత్రి 7.12 గంటలకు కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 26న మధ్యాహ్నం 3.40 గంటల తర్వాత వృషభరాశిని వీడి.. మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభరాశిలోకి వెళ్లే కుజుడు.. బృహస్పతితో కలవనున్నాడు.

వృషభరాశిలో కుజుడు 46 రోజులపాటు ఉండనున్నాడు. దీని ప్రభావంతో.. 5 రాశులవారు అదృష్టవంతులుగా మారబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి.


వృషభ రాశి

కుజుడు ఈ రాశిలోకి ప్రవేశించనుండటంతో.. ఇందులో జన్మించిన వారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. లేదా.. మీరు కోరుకున్న ప్రాంతానికి ఉద్యోగ బదిలీ జరగవచ్చు. 46 రోజుల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు కలసివస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే విద్యా పోటీల్లో పాల్గొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహరాశి

అంగారక సంచారం సింహరాశివారికి గొప్ప ప్రయోజనాలను కలిగించనుంది. ఈ రాశిలో పుట్టినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. 46 రోజుల్లో కొత్తకారు లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే.. చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకెళ్లడంతో విజయాలను అందుకుంటారు.

కన్యారాశి

వృషభరాశిలోకి కుజుడి సంచారం.. ఈ రాశి వారిని ధనవంతుల్ని చేస్తుంది. జూలై 12వ తేదీ నుంచి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ పెట్టుబడి, విదేశీ పని నుంచి ఎక్కువ డబ్బును పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి సమయం ఉంటుంది. మీ హోదా, కీర్తీ పెరుగుతాయి. విద్యార్థులకు మంచి విజయావకాశాలు లభిస్తాయి.

వృశ్చికరాశి

అంగారక గోచారం.. ఈ రాశివారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ పనుల్లో విజయాలకై ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలి. జూలై 12 తర్వాత అన్ని విషయాల్లోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

మీనరాశి

అంగారకుడి సంచారంతో.. మీకు ధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగార్థులకు మంచిరోజులు వస్తాయి. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చేయాలనుకునేవారికి మంచికాలం. త్వరలోనే మీ ఆశయాలు నెరవేరుతాయి. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్తారు. విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశాలున్నాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి గొప్ప కాలం.

(గమనిక : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం, సాధారణ నమ్మకాల ఆధారంగా ఈ వార్తను మీకు అందిస్తున్నాం. దీనిని bigtvlive.com కచ్చితంగా నమ్మాలని చెప్పడంలేదు.)

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×