BigTV English

Abhishek Sharma Creates History: అభి‘షేక్’ .. తొలి భారత క్రికెటర్ గా చరిత్ర

Abhishek Sharma Creates History: అభి‘షేక్’ .. తొలి భారత క్రికెటర్ గా చరిత్ర

Abhishek sharma new record(Cricket news today telugu): సున్నాతో మొదలై సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ కు ఘనంగా అభిషేక్ శర్మ స్వాగతం పలికాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ధనాధన్ ఆడిన అభిషేక్ శర్మ.. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ 20లో సెంచరీ చేసి తొలి భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కేఎల్ రాహుల్ రికార్డ్ బద్దలు కొట్టాడు.


జింబాబ్వే సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఇది అవమానంగా భావించిన శర్మ,  రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చావో రేవో అన్నట్టే ఆడాడు. 46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో సెంచరీ చేసి, జింబాబ్వే బౌలింగుని తుత్తునియలు చేశాడు.

అలా రెండో అంతర్జాతీయ టీ 20లో సెంచరీ కొట్టిన తొలి భారత క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అభిషేక్ శర్మ అధిగమించాడు.


ఇంతకుముందు సెంచరీ చేయడానికి దీపక్ హుడాకి మూడు మ్యాచ్ లు అవసరమైతే, కేఎల్ రాహుల్ నాలుగు మ్యాచ్ లు తీసుకున్నాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ రెండు మ్యాచ్ ల్లోనే
సెంచరీ చేసి వీరిద్దరిని అధిగమించాడు. వీటితో పాటు అభిషేక్ శర్మ ఖతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి.

Also Read: బౌలర్ కుల్‌దీప్ క్లారిటీ.. నటితో డేటింగ్‌.. ఆపై పెళ్లి గురించి..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్  (45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అభిషేక్ దూకుడు చూస్తుంటే వీరందరి రికార్డు ఎంతో కాలం ఉండేలా లేదని అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 8 సిక్స్‌లు కొట్టాడు.. ఈ ఏడాది ఇప్పటివరకు టీ20 లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×