BigTV English

Ganesh Chaturthi 2024: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి

Ganesh Chaturthi 2024: వినాయక చవితిని సెప్టెంబర్ 7 శనివారం రోజున జరుపుకోనున్నాం. హిందూ మతాన్ని నమ్మే వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినాయక చవితికి సంబంధించి సనాతన ధర్మంలో కూడా ఒక నమ్మకం ఉంది. దాని ప్రకారం వినాయక చవితి రోజు చంద్రుడిని చూడటం అశుభం. మరి వినాయక చవితికీ.. చంద్రడుకి మధ్య గల సంబంధిం ఏమిటి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని ఎందుకు చెబుతారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


హిందూ మత విశ్వాసాల ప్రకారం, వినాయక చవితి  రోజున చంద్రుడిని చూడటం అశుభం. మీరు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా చంద్రుడిని చూసినట్లయితే, మీరు మిథ్యా దోషంతో బాధపడతారు. దీని కారణంగా, మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చంద్రుడి చూడకూడదని అంటారు.

వినాయక చవితి రోజు చంద్రునికి సంబంధించిన నమ్మకాలు..


పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు ఎలుకపై తన ఇంటి నుండి బయలుదేరాడు. ఈ సమయంలో అతను అధిక బరువు కారణంగా తడబడ్డాడు. ఇది చూసిన చంద్రుడు నవ్వడం ప్రారంభించాడు. ఈ ఘటన వినాయకుడికి కోపం తెప్పించింది. భాద్రపద మాసంలోని శుక్ల చతుర్థిలో రాత్రిపూట చంద్రుడిని చూసేవారికి సమాజంలో అవమానాలు ఎదురవుతాయని కోపంతో వినాయకుడు చంద్రుడిని శపించాడు. అందుకే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు.

మీరు కనక వినాయక చవితి రోజు అనుకోకుండా చంద్రుడిని చూసినట్లయితే దాన్ని వదిలించుకోవడానికి మీరు ప్రత్యేక పరిష్కారం చేయవచ్చు. ఇందుకోసం వినాయకునికి ఉపవాసం ఉండడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి మీరు పొందవచ్చు. ఇదే కాకుండా వినాయక చవితి రోజు మీరు “సింగ్ ప్రసేనమ్వధిత్సింఘో జాంబ్వత హతః. సుకుమారక్ మరోదిస్తవ హ్యేష స్యమంతకః.” మంత్రాన్ని జపించడం ద్వారా చంద్రుడి దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. చంద్రుడి ఆగ్రహానికి గురి అవ్వకుండా కూడా ఉండవచ్చని చెబుతారు.

Also Read: గణేషుడి అనుగ్రహంతో ఈ 5 రాశుల ఆనందం, సంపద పెరగబోతున్నాయి

వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం:

ఉదయతిథి ప్రకారం సెప్టెంబర్ 7న గణేష్ చవితి జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టింస్తారు. పంచాంగం ప్రకారం, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠాపనకు 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.

విగ్రహ నిమజ్జనం తేదీ:

వినాయక చవితి సెప్టెంబర్ 7, శనివారం నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 17, మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. చతుర్థి రోజున ఇంట్లో, లేదా వీధుల్లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని 10 రోజుల తర్వాత అనంత చతుర్దశి రోజున నీటిలో నిమజ్జనం చేయాలి. ఈ నిమర్జనంతో వినాయక చవితి 10 రోజుల పండగ ముగుస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×