BigTV English
Advertisement

Nag Panchami 2024: నాగ పంచమి పూజ.. పాటించాల్సిన నియమాలు

Nag Panchami 2024: నాగ పంచమి పూజ.. పాటించాల్సిన నియమాలు

Nag Panchami 2024: నాగ పంచమిని ఆగస్టు 9వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా నాగదేవతను ఆరాధిస్తారు. నాగ పంచమి అనేది చాలా శుభ దినం. ఈ రోజు సిద్ధి యోగం, అమృత యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. నాగ నాగపంచమి రోజున నాగ దేవతను పూజించడం వల్ల వల్ల సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.


నాగపంచమి రోజు ఉపవాసం చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. అంతే కాకుండా అన్ని రకాల భయాలు నుంచి మనం కూడా విముక్తి పొందుతాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంతోషం, శ్రేయస్సును అందించే గ్రహాలైన శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు పూజలకు చాలా అనుకూలమైన రోజు. నాగ పంచమి రోజు ఈ పూజ సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • నాగపంచమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి. ఈ సమయంలో రోజంతా స్వచ్ఛతను పాటించండి. ఈ రోజున శివలింగానికి పాలు సమర్పించండి.
  • పూజా సమయంలో ఆచారాల ప్రకారం నాగ దేవతను పూజించండి. మీకు దగ్గరగా ఉన్న పుట్ట వద్ద నాగ దేవతకు పాలు కూడా అందించండి.
  • శంకరుడిని కూడా పూజించడం మంచిది.
  • పూజా సమయంలో పదునైన వస్తువులు ఉపయోగించడం మానుకోవాలి.
  • తామసిక వస్తువులను తినకూడదు.
  • వెండితో చేసిన సర్పానికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి.
  • పూజా సమయంలో మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండండి. పూజా సమయంలో స్వచ్ఛతను పాటించండి.

నాగ పంచమి పవిత్ర సమయం:
నాగ పంచమి రోజు పూజకు అనుకూలమైన సమయం ఉదయం 05:47 నుంచి 8: 27 వరకు, మధ్యాహ్నం 12:13 నుంచి ఒకటి వరకు పూజ కోసం ఇంకా మంచి సమయం కూడా ఉంది. నాగపంచమి నాడు ప్రదోషకాల సమయంలో పూజాకు అనుకూలమైన సమయం. సాయంత్రం 06: 33 నుంచి రాత్రి 8:20 వరకు.


నాగపంచమి రోజు శివుడిని పూజించడం మంచిది. శ్రావణం శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ నెలలో వచ్చే సోమవారం మాత్రమే కాకుండా ఇతర రోజుల్లో కూడా శివుడిని పూజిస్తుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి అంటే నాగ పంచమి అత్యంత ప్రత్యేకమైందిగా పరిగణించబడుతుంది.ఈ రోజు నాగదేవతకు ఆరాధన చేస్తుంటారు. మత విశ్వాసాల ప్రకారం నాగ పంచమి నాడు పాముని పూజించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. దీంతో పాటు ఆనందం , శ్రేయస్సు కలుగుతాయి. నాగపంచమి రోజు నాగదేవతను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నాగ పంచమి రోజు చేసే పూజలో కొన్ని ప్రత్యేక మంత్రాలు చేర్చడం ద్వారా మీ ప్రతి కోరిక నెరవేరుతుంది.

Also Read: నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాగ దేవత ప్రతిమను ఎందుకు తయారు చేస్తారు ?

ఈ మంత్రాలను జపించండి ..

  • ఓం నాగపతి నమః
  • ఓం వ్యాల నమః
  • ఓం అహీ నమః
  • ఓ విషాదార్ నమః
  • ఓం శైలే నమః
  • ఓం భూదార్ నమః

Related News

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Big Stories

×